- బిఎఎసిలో స్పీకర్ నిర్ణయం
- వాకౌట్ చేసిన బిఆర్‌ఎస్, ఎంఐఎం
- బిస్కట్ అండ్ చాయ్‌గా సమావేశం అంటూ హరీష్ విమర్శలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరో ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ మేరకు బీఏసీ(BAC)లో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 21 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశమైంది. అయితే బీఏసీ సమావేశం నుంచి బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేశారు. సభా పని దినాలు, సబ్జెక్ట్‌పై క్లారిటీ ఇవ్వనందుకు వాకౌట్ చేసిన బీఆర్‌ఎస్ ప్రకటించింది. మరోవైపు టీ షర్ట్స్‌పై బీఏసీలో వాడి వేడి చర్చ జరిగింది. టీ షర్ట్స్ వేసుకుని వస్తే తప్పేంటని బీఆర్‌ఎస్ సభ్యులు ప్రశ్నించారు. పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ టీ షర్ట్స్ వేసుకుని వెళ్లడం లేదా అని సమావేశంలో హరీష్ రావు ప్రశ్నించారు. బీఏసీ సమావేశంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విూడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. గంట సేపు సమావేశం జరిగినా సభ పనిదినాలపై స్పష్టత ఇవ్వడం లేదని ఆయన అన్నారు. అందుకే బీఏసీ నుంచి వాకౌట్ చేసినట్ల మాజీ మంత్రి తెలిపారు.
‘మేము 15రోజులు సభ పెట్టాలని అడిగాము. సభను నాలుగైదు రోజులే నడిపే మూడ్‌లో ఉన్నారు. మమ్మల్ని అడ్వయిజ్ మాత్రమే ఇవ్వాలని సీఎం అన్నారు. కేవలం సలహా మాత్రమే ఇవ్వాలని అంటున్నారు. ఇదే విషయంపై ఎంఐఎం కూడా వాక్ ఔట్ చేసింది. ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్‌కు చెప్పాం.
బీఏసీ పెట్టకుండానే బిల్స్ ఎలా పెడతారు అని అడిగాము. పెళ్ళిళ్లు ఉన్నాయని సభ పెట్టకపోవడం ఏంటని అడిగాము. కనీసం 15 రోజులు ఈసారి సభ నడపాలని బీఆర్‌ఎస్ నుంచి అడిగాం. ప్రతిరోజూ జీరో అవర్ పెట్టాలని అడిగాం. టీషర్ట్‌లతో ఎందుకు రానియడం లేదని గట్టిగా అడిగాము. విూ నాయకుడు రాహుల్ గాంధీ టీ షర్ట్‌లతో వెళ్ళాడు కదా అని గుర్తు చేశాము. బీఏసీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ లాగా చేశారు‘ అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు.బీఏసీ అంటే బిస్కెట్ అండ్ చాయ్ లాగా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ భేటీ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం హరీష్ రావు, ఎంఐఎం సభ్యులు హాజరయ్యారు. కాగా.. సభలో విూరు కేవలం సలహా మాత్రమే ఇవ్వాలని అనడంతో బీఆర్‌ఎస్ వాకౌట్ చేసిందన్నారు. ఇదే విషయంపై ఎంఐఎం కూడా వాక్ ఔట్ చేసిందని హరీష్ రావు తెలిపారు. సభ పని దినాలు అజెండా పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని నిరసన తెలిపామన్నారు. సభ గంటన్నర పాటు కొనసాగిందన్నారు.