ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 26న సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్దత కల్పించడం,మూసీ బాధితుల అంశంతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.