తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన ప్రక్షాళనపై దృష్టి సారించింది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరోసారి ఐపీఎస్లను బదిలీ చేసింది. కొత్తగూడెం ఓఎస్‌డీగా పరితోశ్ పంకజ్, ములుగు ఓఎస్‌డీగా గీతే మహేష్ బాబా సాహెబ్, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా కాంతిలాల్ సుభాష్, గవర్నర్ ఓఎస్‌డీగా సిరిశెట్టి సంకీర్త్ బదిలీ అయ్యారు. అలాగే, వేములవాడ ఏఎస్పీగా శేషాద్రి రెడ్డి, భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్, ఏటూరునాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ, భైంసా ఏఎస్పీగా అవినాశ్ కుమార్ బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, గత నెల 17న కూడా రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో 28 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఆ సమయంలో ఐడీ ఎస్పీగా విశ్వజిత్ కంపాటి నియమితుడయ్యారు. అలాగు, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా రాహుల్ హెగ్డేను ప్రభుత్వం నియమించింది. ఇప్పుడు మరికొంత మందికి స్థానచలనం కలిగింది.