60 ఏండ్ల కల సాకారం చేసుకున్న తెలంగాణలో..
ఎన్నో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రభుత్వాలు మారుతున్న కొద్ది.. తెలంగాణ తల్లి విగ్రహా రూపాలు మారుతున్నాయి.
నాయకులు పార్టీల కండువాలు మార్చినంత ఈజీగా..
తెలంగాణ తల్లి రూపాలు మార్చడం సిగ్గనిపిస్తోంది..
ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెత పుట్టిన తెలంగాణలో..
ఎవరి స్వలాభం కోసం వారు అమ్మ రూపన్నే మార్చేస్తున్నారు..
నాయకుల వింత చేష్టలు చూసి.. తెలంగాణ సమాజం అవమానంతో తలదించుకుంటుంది.
ఎవరికి వారే ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకొని ప్రజల్నీ ఫూల్స్ చేస్తున్నారు..
రేపటి రోజున ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తే..
తెలంగాణ ఆత్మ గౌరవం అని చెప్పుకునే రాష్ట్రాన్ని,
తెలంగాణ తల్లిగా అభివర్ణిస్తున్న తల్లి రూపాన్ని మార్చకుండా
ఓ చట్టాన్ని తీసుకురండి పాలకులారా..!
Must Read