దేశంలో మరోసారి ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు.అమర్నాథ్ యాత్రకు ఐఎస్ఐ ఉగ్రవాదుల నుండి ప్రమాదం పొంచివుందని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థైన “బబ్బర్ ఖల్సా”తో కలిసి ఈ దాడి చేయలని భావిస్తున్నట్టు అనుమానిస్తున్నాయి.అలాగే పంజాబ్ తో పాటు ఢిల్లీలోని బీజేపీ నాయకులే లక్ష్యంగా దాడులు చేసి అలజడి సృష్టించాలని ఉగ్రవాదులు ప్రణాళిక రచిస్తున్నట్టు నిఘావర్గాలు హెచ్చరించాయి.ఈ దాడులు చేసేందుకు ఇప్పటికే 06 నుండి 07 మంది ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్ నుండి దేశంలోకి ప్రవేశించినట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.నిఘావర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా బలగాలు అమర్నాథ్ యాత్రకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తున్నారు.జూన్ 29న మొదలైన అమర్నాథ్ యాత్ర ఆగష్టు 19న ముగుస్తుంది.