Sunday, November 24, 2024
spot_img

ఆ మాజీ మంత్రి పెద్ద దొంగా,త్వరలోనే అక్రమాలన్ని బయటపెడతా

Must Read
  • మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పై మర్డర్ కేసులు ఉన్నది వాస్తవమే అని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,నల్గొండ జిల్లా మాజీ మంత్రి పెద్ద దొంగని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమం సమయంలో తన దగ్గర నుండి రూ.10,000, రూ.20,000 తీసుకునేవాడని,ఇప్పుడు కోట్ల రూపాయలు సంపాదించాడని వ్యాఖ్యనించారు.జగదీష్ రెడ్డి చేసినా అక్రమాలను త్వరలోనే బయటపెడతానని తెలిపారు.

ఇదిలా ఉండగా అసెంబ్లీ చర్చలో భాగంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి,సీఎం రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ కొనసాగింది.ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి నల్గొండలో నేర చరిత్ర ఉందని,ఓ హత్య కేసులో భాగంగా 16 ఏళ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నారని కోమటి రెడ్డి విమర్శించారు.కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన విమర్శల పై జగదీష్ రెడ్డి స్పందించారు.ఈ సందర్బంగా అయిన మాట్లాడుతూ,తన నేర చరిత్ర నిజమని నిరుపిస్తే ఇదే సభలో ముక్కు నెలకు రాసి ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేస్తానని,నిరూపించకపోతే కోమటి రెడ్డి వెంకటరెడ్డి తో సహా సీఎం రేవంత్ రెడ్డి తమ పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.తెలంగాణ ఉద్యమం తప్ప తన పై వేరే కేసులు లేవని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS