- వెల్లడించిన అంతర్జాతీయ మీడియా సంస్థ
- బాంబు పేలుడు ద్వారా ఇస్మాయిల్ హానీయా హత్య
- రెండు నెలల నుండే హత్యకి ప్లాన్
రెండు నెలల ముందు నుండే హమాస్ అధినేత ఇస్మాయిల్ హానియా హత్యకి ప్లాన్ చేసినట్టు అంతర్జాతీయ మీడియా సంస్థ (ది న్యూయార్క్ టైమ్స్) ప్రకటించింది.బుధవారం క్షిపణుల దాడిలో ఇస్మాయిల్ హానియా మృతి చెందారని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.అయితే తాజాగా ఇస్మాయిల్ హానీయా క్షిపణుల దాడిలో మృతి చెందలేదని,పక్క ప్లాన్ ప్రకారమే బాంబు పేలుడు ద్వారా అయినను హత్య చేసినట్టు ది న్యూ యార్క్ పేర్కొంది.ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ లోని ఓ భవనంలో ఇస్మాయిల్ హానియా నివాసముంటారని తెలుసుకున్న దుండగులు రెండు నెలల కిందటే ఓ బాంబును తీసుకొచ్చి హానీయా గదిలో పెట్టారని,అప్పటినుండి అయిన కదలికలను గమనిస్తూనే ఉన్నారని వెల్లడించింది.