పంజాబ్ లో పెను ప్రమాదం తప్పింది.కొంతమంది ఆగంతకులు రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లను పెట్టారు.ఇది గమనించి వెంటనే అప్రమత్తమైన లోకోపైలెట్ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదమే తప్పింది.ఈ ఘటన పంజాబ్ లోని భటిండాలో జరిగింది.సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.