( బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ )
నాటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జేన్సీతో దేశంలోని ప్రజలంతా ఆవస్థలు ఎదుర్కొన్నారని భారతీయ జనతా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డా.లక్ష్మణ్ విమర్శించారు.బర్కత్ పుర లోని బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాడిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సంధర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజల యొక్క స్వేచ్ఛను అప్పటి ప్రభుత్వం కాలరాసిందని విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎంతో మందిని బలితీసుకుందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారని,కోదండ రామ్ లాంటి వారు ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.కమ్యూనిష్టులు ఎమర్జెన్సీ ని సమర్థించారు చరిత్ర వారిని ఎప్పటికీ క్షమించదాని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాజ్యాంగానికి తూట్లు పొడిచిందని విమర్శించారు.ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణ పేదలకు సైతం రిజర్వేషన్లు ఇచ్చామని లక్ష్మణ్ పేర్కొన్నారు.అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ నియంతృత్వంగా, నిరంకుశంగా వ్యవహరించి ఎమర్జేన్సీని విధించిందని విమర్శించారు.ప్రజాస్వామ్య చరిత్రలో ఈ ఘటన ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందని గౌతమ్ రావు ఆరోపించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మహంకాళీ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్, వెంకటరమణి, పూస రాజు, కార్పోరేటర్లు, నాయకులు తదితరులు పాల్గోన్నారు