Friday, September 20, 2024
spot_img

ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది

Must Read
  • కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
  • బీఆర్ఎస్ కు పదేళ్లు పడితే కాంగ్రెస్ కు ఐదేళ్లూ కూడా పట్టదు
  • నిరుద్యోగ భృతి ఇస్తామని హస్తం పార్టీ మాట తప్పింది
  • జాబ్ కాలెండర్ ఎటు పోయింది సీఎం రేవంత్ .?
  • కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న విషయమే మర్చిపోయారు
  • నిరుద్యోగుల మహాధర్నాలో పాల్గొన్న కేంద్రమంత్రి

కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తుంగలొ తొక్కిందని ఆయన దుయ్యబట్టారు. శనివారం నాడు జరిగిన నిరుద్యోగుల మహాధర్నాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి పదేళ్ల కాలం పట్టింది కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి కనీసం ఐదేళ్లు కూడా పట్టదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యువత ఆత్మబలిదానం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత భావించిన యువత ఆశలను గత బీఆర్ఎస్ నట్టేట ముంచిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యూత్ డిక్లరేషన్ తో ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి నేడు వాటిని మరిచిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక, రేవంత్ బహిరంగ సభల్లో రెండు లక్షల ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టారు. రుణమాఫీ కూడా రైతులను మభ్య పెట్టేలా చేశారని కిషన్ రెడ్డి ఆక్షేపించారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ చేయాల్సి ఉండగా కొంత మందికే రుణమాఫీ చేసి పాలాభిషేకాలు చేయించుకుంటూ ఊర్లల్లో సంబురాలు చేసుకుంటున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు జాబ్ కాలెండర్ ఇస్తామన్నార అదీ ఎటు పోయిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. 18 ఏళ్లు నిండిన కాలేజీ అమ్మాయిలకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ మాటే గుర్తు లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి చెల్లిస్తామని నిరుద్యోగులను ఈ సర్కార నట్టేట ముంచిందని మండిపడ్డారు. ప్రజాపాలనలో సెక్రటేరియట్లోకి సామాన్యులకు ఎంట్రీ లేదు. కాంగ్రెస్ పైరవీకారులకు మాత్రమే ఉందన్నారు. విద్యా భరోసా కార్డులు ఎటు పోయాయో రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఆ ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయన్నారు. ప్రజలను దోపిడీ చేసే స్వేచ్ఛ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. బీఆర్ఎస్ చేసినట్లే కాంగ్రెస్ చేస్తుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపులు కాంగ్రెస్ చేస్తోంది. అవినీతి పాలనలో, దోపిడీలో, ఫిరాయింపుల్లో ఎలాంటి మార్పు రాలేదు. నిరుద్యోగులకు అండగా బీజేపీ ఉంటుంది. బీజేవైం ద్వారా మా పోరాటాలు యువత కోసం కొనసాగుతాయి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This