Friday, September 20, 2024
spot_img

నిరుద్యోగుల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

గీత కార్మికులు తమ పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తాటివనంలో మొక్కలను నాటి లష్కర్ గూడలో ఆధునిక టెక్నాలజీతో తయారు చేసిన సేఫ్టీ కిట్లను గీత కార్మికులకు అందజేశారు.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,తాటి వనాల పెంపుకు గీత కార్మికులు ప్రోత్సహించాలని కోరారు.రియల్ ఎస్టేట్ రంగం పెరగడంతో తాటి వనాలు తగ్గుతున్నాయని అన్నారు.వన మహోత్సవంలో భాగంగా తాటి చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు.పేదలకు కార్పొరేట్ విద్య,వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్,ఆరోగ్య శ్రీ పథకాలను అందించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందని గుర్తుచేశారు.ఓఅర్ఆర్ వల్ల రంగారెడ్డి జిల్లా భూముల విలువ పెరిగిందని తెలిపారు.త్వరలోనే హయత్ నగర్ కి మెట్రో కూడా వస్తుందని అన్నారు.అనంతరం రాష్ట్రంలో నిరుద్యోగులు చేస్తున్న ధర్నాల పై మాట్లాడుతూ,నిరుద్యోగులకు ఏమైనా సమస్యలు వుంటే మంత్రులను కలవండి అని పేర్కొన్నారు.నిన్న,మొన్నటి వరకు కొందరు అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారని గుర్తుచేశారు.ప్రభుత్వం వారి సమస్యలు వినడానికి సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.బీఆర్‌ఎస్,బీజేపీ నాయకులు మా ప్రభుత్వాన్ని పడగొడతామని,మా పని అయిపోయిందని అంటున్నారు ఇప్పుడు వారి ఆనవాళ్లే కనిపించకుండా పోయాయని తెలిపారు.వారు ప్రభుత్వాన్ని పడగొడితే,మేం నిలబెడుతామని ఎమ్మెల్యేలు తమ దగ్గరికి వస్తున్నారని గుర్తుచేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This