Monday, October 13, 2025
spot_img

కుంభమేళాకు పెరుగుతున్న భక్తజనం

Must Read
  • దేశవిదేశీ భక్తుల రాకతో ప్రత్యేక ఆకర్శణ

కుంభమేళా జరుగుతున్న త్రివేణీ సంగమ తీరం భక్తకోటితో నిండిపోతోంది. కనుచూపుమేర ఎటుచూసినా భక్తుల పుణ్యస్నానాలే కనిపిస్తున్నాయి.రోజూ రెండుకోట్లకు తగ్గకుండా భక్తులు వస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా.. విదేశీయులు సైతం కాషాయ వస్త్రాలు, రుద్రాక్షలు ధరించి పుణ్యస్నానాలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ఆధ్యాత్మిక సంగమం ఒక విశ్వ సంబరంగా మారింది. నదీ స్నానం సర్వ పాప హరణం అని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. అందులోనూ పరమ పవిత్రమైన గంగా నది, తోడుగా యమున, అంతర్వాహినిగా సరస్వతి ఒకేచోట సంగమించే ప్రదేశంలో నదీ స్నానం ఆచరించడం జన్మజన్మల పాపాలను హరిస్తుందనేది హిందువుల విశ్వాసం. పైగా.. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళా ఇది. ఇప్పుడు తప్పితే . మళ్లీ ఇలాంటి మహా కుంభమేళాలో పాల్గొనడం దాదాపుగా అసాధ్యం. అందుకే.. పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. అందులోనూ, మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం రావడంతో.. వివిధ వర్గాలకు చెందిన 13 అఖాడాలు మహాకుంభమేళాకు వచ్చాయి. ఈ అఖాడాలు తెల్లవారుజామున 3 గంటలకు బ్రహ్మముహూర్తంలో అమృత స్నానాలు ప్రారంభించేస్తున్నారు. ఏరోజు కూడా కోటిన్నరకు తగ్గకుండా భక్తులు అమృత స్నానాలు ఆచరించినట్లు మహా కుంభమేళా అధికారులు ప్రకటించారు. దాదాపు 10 వేల ఎకరాల కుంభనగర్‌లో ఎటుచూసినా భక్తగణమే కనిపిస్తున్నారు. సంక్రాంతి తరువాత వచ్చే ఉత్తరాయణ పుణ్య తిథి.. ఫిబ్రవరి 3వ తేదీన వచ్చే వసంత పంచమి. ఆ రోజు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విదేశీయుల గురించి. సామాన్యులు, సాధువులు, అఖాడాలతో కలిసి పుణ్యస్నానం ఆచరించేందుకు అమెరికా, యూరప్‌, ఇతర దేశాల నుంచి తరలి వస్తున్నారు. బహుశా తాము గత జన్మలో భారత్‌లో పుట్టి ఉంటామంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయడం తమకు దక్కిన వరం అని సంబరపడిపోతున్నారు ఫారెనర్స్‌. పైగా.. ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా చేసింది యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం. ఈసారి 40 కోట్ల మంది వస్తారనే అంచనాలతో.. అంతకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు. ఇక సంధ్యాసమయంలో త్రివేణీ సంగమం ఘాట్‌ వద్ద నదీమతల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు రెండు కళ్లూ చాలడం లేదు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This