Saturday, September 6, 2025
spot_img

డిజిటల్ కార్డుపైన ఇంటి మహిళనే యాజమనిగా గుర్తించాలి

Must Read
  • సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందజేసే డిజిటల్ కార్డుపైన ఆ ఇంటి మహిళనే యాజమనిగా గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్బంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జారీ చేసే డిజిటల్ కార్డుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు వివరించారు. కుటుంబంలోని సభ్యుల పేర్లు, ఇతర వివరాలను కార్డు వెనుక భాగంలో ఉండే విధంగా కార్డుల రూపకల్పన జరగాలని ఆదేశించారు. రేష‌న్, రాజీవ్ ఆరోగ్య‌శ్రీ‌, ఐటీ, వ్య‌వ‌సాయ‌, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల్లోని డాటా ఆధారంగా కుటుంబాలను నిర్ధారించాలని వెల్లడించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో ఏ ఏ అంశాలను పొందుపరచాలన్న వివరాలను నివేదిక రూపంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘానికి అందించాలని తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనలకు అనుగుణంగా సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించాలని, అక్టోబర్ 3వ తేదీ నుండి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎలాంటి లోపాలు లేకుండా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పొన్నం ప్రభాకర్ , ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This