- మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను దగా చేస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నివాలర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం మంచి చేసిందని..సంబరాలు చేసుకుంటుందో చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు డ్రామా కంపెనీలు..రెండు పార్టీలు ఆడుతున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డ్రామాలకు మహారాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని అక్కడి ప్రజలు ఒడిస్తే..సిగ్గులేకుండా ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై రేపు హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో బిజెపి బహిరంగ సభ నిర్వహిస్తుందని..ఈ సభకు ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరావుతారని తెలిపారు.