- సీఎం రేవంత్ రెడ్డి
భారాస పార్టీ నేతలకు అధికారం పోయిన అహంకారం మాత్రం తగ్గలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. శనివారం చార్మినార్ వద్ద నిర్వహించిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవంలో పాల్గొని మాట్లాడుతూ, పేదలను కాంగ్రెస్ పార్టీ అదుకుంటుంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుండెలు బాదుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందాని, కేటీఆర్ ఫిరంగి నాళాలను ఆక్రమించి ఫాంహౌజ్ లు కట్టారని విమర్శించారు. హైడ్రాను చూసి చెరువులను, నాళాలను ఆక్రమించుకున్న వారు భయపడుతున్నారని అన్నారు. పేదలకు మేలు జరుగుతుంటే కేటీఆర్, హరీష్రావు చూసి ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యనించారు.
కులాలను,మతాలను ఏకం చేయడానికే రాజీవ్ సద్భావనా యాత్ర ఏర్పాటు చేశామని తెలిపారు. పేదలను కాంగ్రెస్ పార్టీ అక్కున చేర్చుకుందాని, ఎస్సీ, ఎస్టీలకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. దేశాన్ని సమగ్రంగా ఉంచేందుకు ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించారని తెలిపారు. నియంత పాలనను గద్దె దింపడం కోసం మాజీమంత్రి గీతారెడ్డి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.