ఏపీ ప్రభుత్వం పై మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు.బుధవారం గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామర్శించారు.ఈ సంధర్బంగా మీడియాతో మాట్లాడుతూ,ప్రభుత్వం పై కీలక సంచలన ఆరోపణలు చేశారు.తమ పార్టీ నేతలను టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో వేదిస్తుందని మండిపడ్డారు.రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను వేదిస్తున్నరని,రాబోయే రోజుల్లో అదే జైల్లో మీ నాయకులు ఉంటారని హెచ్చరించారు.రెడ్ బుక్ మీ సొంతమే కాదు,మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని అన్నారు.ఏపీకి భారీ తుఫాన్ వస్తుందని వాతావరణశాఖ హెచ్చరించిన సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ చేయలేదని విమర్శించారు.