- గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ
- ఇచ్చిన హామీ మేరకు రెండు జీవోలు విడుదల
- ఉస్మానియా,గాంధీ ఆసుప్రతులతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
గాంధీ,ఉస్మానియా ఆసుప్రతుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది.జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసింది.ఉస్మానియా,గాంధీ ఆసుపత్రిలతో పాటు కాకతీయ వర్సిటీకి రూ.204.85 కోట్లు కేటాయించింది.ఉస్మానియా వసతి భవనాలు,రోడ్ల కొరకు రూ.121.90 కోట్లు,గాంధీ ఆసుప్రతికి రూ.79.50 కోట్లు కేటాయించింది.ఇక కాకతీయ వర్సిటీలో సీసీ రోడ్ల మరమ్మత్తుల కోసం రూ.2.75 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.జూడాల డిమాండ్స్ మేరకు గాంధీ,ఉస్మానియా ఆసుపత్రుల్లో వసతి భవనాలు,కాకతీయ వర్సిటీల్లో రోడ్ల మరమ్మతుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.ప్రభుత్వం హామీ ఇవ్వడంతో సమ్మెని నిలిపివేస్తున్నట్లు జూడాలు తెలిపారు.