Friday, February 21, 2025
spot_img

అన్నారం దర్గా తలనీలాల క‌హానీ

Must Read
  • మహిళల పెద్ద తలనీలాలు మాయం
  • చిన్న పిల్లల తలనీలాలు మాత్రమే చూపించిన ఇన్‌స్పెక్ట‌ర్‌
  • 30లక్షల సరుకు చాటుగా అమ్ముకొని 5 లక్షలు మాత్రమే వక్ఫ్‌ బోర్డులో జమ
  • ఇక్కడి ఒక కళ్యాణకట్ట చేసే వ్యక్తితో కుమ్మక్కు అయిన సుబ్బారావు
  • వక్ఫ్‌ బోర్డు ఆదాయానికి గండి కొట్టిన వైనం
  • జిల్లా మైనార్టీ అధికారి టి.రమేష్‌ విచారణలో తేలిన తలనీలాల మాయం.
  • గ్రామ ప్రజలు సమక్షంలో విచారణ, తల నీలాల దొంగతనం చేసిన సుబ్బారావు పై ఇక్కడ సహకరించిన కళ్యాణకట్ట చేసే వ్యక్తి.
  • ఇన్‌స్పెక్ట‌ర్‌పై కేసు నమోదు చేసి చట్టపరమైన విచారణ చేసి, తల నీలాలను రికవరీ చేయాలనీ వినతి పత్రం ఇచ్చిన గ్రామస్థులు.

వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌ దర్గా లోని తల వెంట్రుకలు మాయంపై విచారణ చేయడం జరిగిందని జిల్లా మైనార్టీ సెల్‌ అధికారి టి.రమేష్‌ తెలిపారు. ఇప్పుడు వున్న సరుకుచిన్న వెంట్రుకలు కొద్దిగానే వుందని, దర్గా కల్యాణ కట్ట వద్ద పర్యవేక్షణ లేదని, ఇట్టి విషయాలను జిల్లా కలెక్టర్‌ సత్య శారదకి నివేదిక ఇస్తానని తెలిపారు. స్థానికుడు. ఎండి గౌస్‌ పాషా మాట్లాడుతూ ఒక వారం వచ్చే తలనీలాలను 70 వేల రూపాయలకు తీసుకున్నాను. ఆ తర్వాత నాకు ఇవ్వడం ఆపివేసి ఒక సంవత్సరం సరుకు కేవలం 5 లక్షలకు ఇవ్వడం పెద్ద మోసం. సంవత్సరానికి 30 లక్షల రూపాయల విలువ గల సరుకు 5 లక్షలకు ఎలా ఇస్తారు.? ఈ విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది. సరుకు తీసుకున్న సుబ్బారావు పై పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు చేయాలి. సరుకు రాబట్టి బహిరంగ వేలం ద్వారా అమ్మాలని డిమాండ్‌ చేశాడు.

గ్రామస్తులు మాట్లాడుతూ కల్యాణ కట్టకి టికెట్‌ ధర 100 రూపాయలు చెల్లించాలి. గుండు చేసిన అనంతరం భక్తుల దగ్గర జబర్దస్త్‌ చేస్తూ 100 నుండి 200 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. కొబ్బరికాయకు టికెట్‌ కొనాలి లోపలికెళ్లాక భక్తులను బలవంతంగా కానుకల రూపంలో బలి చేస్తున్నారు. కోడి కందూరైతే ఒక రకం యాటకుందూరైతే మరోరకం ఇలా చెప్పుకుంటూ పోతే అన్నారంలో అడుగుపెట్టిన నుండి అడుగడుగునా అక్రమ వ‌సూల దందా కొనసాగుతుందని ఇప్పటికైనా అధికారులు చొరవ చూపించి అన్నారంలో అక్రమ దందాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఈరగని సాంబయ్య మాజీ సర్పంచ్‌, బిక్షనాయక్‌ మాజీ ఎంపీటీసీ, ఈరగని మనోహర్‌, మాజీ ఎంపీటీసీ, జడల క్రిష్ట మాజీ సర్పంచ్‌,ఎస్‌ కే. షబ్బీర్‌ అలీ మాజీ మండల కో . ఆప్షన్‌ సభ్యులు, రాపోలు యాకయ్య మాజీ ఉప సర్పంచ్‌, ఎండీ గౌస్‌ పాషా, జిల్లా మైనారిటీ విచారణ అధికారి టి రమేష్‌ కి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, దర్గా సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

వనవర్తి జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం..

4వేలకుగా పైగా చనిపోయిన కోళ్లు సమాచారం ఇచ్చినా పట్టించుకోని అధికారులు వనపర్తి జిల్లాలోని బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో శివకేశవరెడ్డి అనే రైతుకు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS