రష్యా తూర్పు ప్రాంతంలో అదృశ్యమైన హెలికాఫ్టర్ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు.22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శకలాలు కంచట్కాలోని తూర్పు ద్వీపకల్పంలో లభించాయని అధికారులు వెల్లడించారు.17 మంది మృతదేహాలను వెలికితీశామని తెలిపారు.ఎం.ఐ.08 హెలికాప్టర్ వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సమీపంలోని స్థావరం నుండి బయలుదేరింది.మాస్కోకు తూర్పున 7,100 కి.మీ (4,400 మైళ్ళు) దూరంలో ఉన్న కమ్చట్కా ద్వీపకల్పం వారాంతంలో భారీ గాలులు మరియు వర్షం పడింది.ప్రమాదానికి ప్రతికూల వాతావరణమే కారణమని అధికారులు భావిస్తున్నారు.