Thursday, April 3, 2025
spot_img

లడ్డూ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం

Must Read

తిరుమల కల్తీ లడ్డూ వివాదం పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయి,జస్టిస్ కెవి విశ్వనాథన్‎లతో కూడిన ధర్మాసనం లడ్డూ వివాదంపై విచారణ జరిపింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బృందంలో సీబీఐ నుండి ఇద్దరు , రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ ఎస్‎ఎస్‎ఏఐ నుండి ఒక అధికారి సభ్యులుగా ఉండాలని తెలిపింది. స్వతంత్ర సీట్ బృందం దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించినట్లు జస్టిస్ బీఆర్ గవాయి , జస్టిస్ కేవీ విశ్వనాథన్ బెంచ్ తెలిపింది. తిరుమల లడ్డూ వ్యవహారం పొలిటికల్ డ్రామాకు దారితీయాలని తాము భావించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యనించింది.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS