హర్షసాయి కేసులో మరో ట్విస్ట్ నెలకొంది.తనకు మెయిల్స్ ద్వారా హర్షసాయి వేధిస్తున్నాడు అంటూ బాధితురాలు మరోసారి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అంతేకాకుండా తన వద్ద నుండి రూ.02 కోట్లు తీసుకున్నానడాని మంగళవారం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో హర్షసాయి పై సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హర్షసాయి పరారీలో ఉన్నట్టు సమాచారం.