Saturday, November 23, 2024
spot_img

అక్రమాల విద్యకు అడ్డుకట్ట ఏదీ…!

Must Read
  • కార్పొరేట్ విద్యకు కోపరేషన్

దేశాన్ని కానీ సమాజాన్ని గానీ సర్వనాశనం చేయాలంటే ఇతర దేశాలు దాడి చేయడం పెద్ద పెద్ద అనుబాంబులు అవసరం లేదు.ఫేక్ (నాసిరకం) విధానాన్ని ప్రోత్సహిస్తే చాలు.దేశం దానంతట అదే ఖతం అయిపోతుంది.దేశంలో నాసిరకం విద్య,మాస్ కాఫీయింగ్, లీకేజీల ప్రోత్సాహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.దానివల్ల డాక్టర్ చేతిలో పేషెంట్,ఇంజనీర్ చేతిలో భవనాలు,జడ్జిల చేతుల్లో న్యాయం అన్యాయం అయిపోవడం, \సంఘ సంస్కర్తల చేతల్లో మానవత్వం బలి,ఆర్థిక వేత్తల చేతుల్లో ఆర్థిక విధానం నలిగిపోతోంది.ఏ దేశంలో అయితే విద్య నాశనం అవుతుందో ఆ దేశం పతనం అయిపోతుంది.విద్య జ్ఞానం కోసం కానీ,బిజినెస్ మాత్రం కాదు.

మౌలిక వసతుల్లో విద్య ప్రాధాన్యమైనది.విద్య రంగం ద్వారా మానవ వనరులను కాపాడుకోవచ్చు. దేశంలో ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, సమానంగా, ఉచితంగా అందించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ ఇక్కడ విద్యా రంగంలోకి ప్రైవేట్ విద్య వచ్చేసింది.పోటీగా కార్పొరేట్ అయిపోయింది.ఎప్పుడైతే విద్య బిజినెస్ కు దగ్గర అయిందో.లాభాల కోసం అక్రమాలకు తావొచ్చింది.పత్రికలు, టీవీ చానల్స్, వివిధ రకాల ప్రకటనలు, యాడ్స్ లో ప్రైవేట్ విద్య సంస్థలు ర్యాంకులు సాధించినట్లు చెప్పుకుంటున్నాయి.ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వహణకు ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ ప్రమేయం అవసరం ఉంటుంది.ప్రైవేట్-ప్రభుత్వం కలిసి భాగస్వామిగా అవినీతి,అక్రమాలు జరుగుతున్నాయి.

దేశంలో ఇంటర్ పూర్తయిన విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే పేపర్ లీక్ అయింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ జూన్ లో రాసిన పరీక్ష రద్దయింది. తరువాత నీట్ పీజీ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈ పరీక్షలను ఎన్టిఏ నిర్వహిస్తోంది. అయితే లీకేజీలపై వేసిన హై పవర్ కమిషన్ చైర్మన్ గా ఎన్టిఏ చైర్మన్ ను నియమించడం పలు ఆలోచనలకు దారి తీస్తోంది. రకరకాల విద్యార్హతలు కలిగిన ఫేక్ సర్టిఫికెట్లు, స్కామ్ లు వస్తూనే ఉంటాయి.తెలంగాణలో 2014 నుండి ఇప్పటివరకు tspsc ద్వారా నిర్వహించిన 15 పరీక్షల ప్రశ్నా పత్రాలు లీకైయ్యాయి.ఆంధ్రాలో 2022లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది. కానీ అక్కడ ఎలాంటి పోటీ పరీక్షల పేపర్లు లీక్ కాలేదు. వీటికి కారణం ఉద్యోగ నియామక ప్రకటనలు చేయకపోవడం, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా మరో అవినీతి యంత్రాంగం తయారు కావడం.

పేపర్ లీకేజీల వెనుక 100 కోట్ల కుంభకోణాలు దాగి ఉన్నది.ఈ లీకేజీలు ఎక్కువ సంపద కలిగిన వ్యక్తుల కోసం చేస్తున్నట్లుంది. ఎకనామిక్ అండ్ పొలిటికల్, బిజినెస్ స్టాండర్స్ గణాంకాల ప్రకారం బ్లాక్ మనీని ఉత్పత్తి చేస్తున్న వాటిలో ఫార్మాసిటికల్,రియల్ ఎస్టేట్ తో పాటు విద్యారంగం కూడా చేరిపోయింది.దీన్ని బట్టి విద్య వ్యవస్థలో అవినీతిని అంచనా వేయవచ్చు.అకాడమిక్ అడ్మినిస్ట్రేటి వ్స్, పొలిటికల్ ఇమేజ్ తో వచ్చి రూల్స్ కు వ్యతిరేకంగా నియామకాలు, భవనాల నిర్మాణాల్లో అవినీతి చేసి కోట్లు సంపాదిస్తున్నారు.తరువాత ప్రభుత్వాలు మారినాక వాళ్లు సంపాదించిన దాంతోనే రాజకీయాల్లోకి వచ్చి విద్యారంగంలో చేసిన తప్పులను మాఫీ చేసుకుంటున్నారు. ఇన్ని అక్రమాలకు పాల్పడిన ఏ అధికారికి కూడా శిక్ష పడే దాఖలాలు లేవు.అందుకే అక్రమాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అవినీతి చేయడం ఆ డబ్బుతో మళ్ళీ రాజకీయాల్లోకి రావడం వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చు కోవడమే జరుగుతోంది.ఇలా దేశంలో విద్య నిర్వీర్యం అయితే ఆ దేశాలు పతనం ఖాయం. ఇలాంటివి ప్రోత్సహిస్తే మన దేశం పైన మనమే దాడి చేసినట్లు.

అయితే విద్య వ్యవస్థలో చాలామంది నిజాయితీగా పనిచేసే అడ్మినిస్ట్రేటివ్,ఎంటర్ పెన్యువర్స్ ఉన్నారు.వాళ్లు చట్టం ప్రకారం పని చేయడం కఠినంగా మారుతోంది.ఒకపక్క రాజకీయ ఒత్తిడిలు,మరోపక్క అవినీతి విధానాల నుంచి నిజాయితీగా పనిచేసే అడ్మినిస్ట్రేటర్స్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత.ప్రభుత్వాలు,పబ్లిక్ పై ఉంది.భవిష్యత్ తరాల కోసం వీరికి రక్షణ కల్పించవలసిన అవసరం కూడా ఉంది.

రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిని చట్టం ప్రకారం శిక్షించాలి. నిర్వీర్యం అవుతున్న విద్య వ్యవస్థను కాపాడుకోవడానికి రెగ్యులేషన్, ప్రొహిబిషన్ చట్టం వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉంది. చట్టం ప్రకారం పని చేస్తున్న వారికి రక్షణ ఇచ్చి విద్యా ప్రమాణాలు, నైతిక విలువలు పెరిగేలా,అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే విధంగా విద్య వ్యవస్థను అభివృద్ధి చేసుకోవాలి.

  • పట్ట. హరనాథ్
Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS