Sunday, February 23, 2025
spot_img

ధర్మద్రోహులను క్షమించేది లేదు..

Must Read
  • చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులు రంగరాజన్‌కి వీహెచ్‌పి రాష్ట్ర ప్రతినిధి బృందం పరామర్శ
  • ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా అండగా ఉంటామని భరోసా
  • దుర్మార్గుల చేతిలో చిత్రహింసలు అనుభవించానని రంగరాజన్‌ ఆవేదన
  • వీహెచ్‌పి అండగా నిలబడటం కొండంత బలాన్ని ఇచ్చింది: రంగరాజన్‌

చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ పై దాడికి పాల్పడిన ధర్మ ద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్‌ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం డిమాండ్‌ చేసింది. రాముడుని అడ్డం పెట్టుకొని ధర్మం పై దాడి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చ రించింది. బుధవారం సాయంత్రం విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర ప్రతినిధి బృందం వెళ్లి చిలుకూరులో రంగరాజన్‌ని పరామర్శిం చింది. దాదాపు అరగంటపాటు మాట్లాడి జరిగిన ఘటనగురించి అన్ని విషయాలు చర్చించారు. ఈసందర్భంగా రంగరాజన్‌కి విశ్వహిందూ పరిషత్‌ అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించింది. ఎటువంటి విపత్కర పరిస్థితిలో నైనా ధర్మరక్షణకు తాము కట్టుబడి ఉంటామని విశ్వహిందూ పరిషత్‌ నాయకులు స్పష్టం చేశారు. దాడిఘటన తమను తీవ్రంగా కలిసి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మంముసుగులో కొంతమంది హిందు త్వాన్ని అభాసుపాలు చేసేప్రయత్నం చేస్తున్నారని దీనిని యావత్‌ హిందూ సమాజం తీవ్రంగా పరిగణించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో రాడికల్‌ సిష్టానికి, చెట్ట వ్యతిరేక శక్తులకు తావు లేదని పేర్కొన్నారు. ఎంతటి వ్యక్తులైన కూడా చట్టానికి లోబడే పని చేయాలని సూచించారు. ధర్మం పేరు చెప్పి దౌర్జ న్యాలకు పాల్పడటం, వ్యాపారాలు చేయడం ధర్మద్రోహం అని అన్నారు.

ఈ సందర్భంగా రంగరాజన్‌ మాట్లాడుతూ.. విశ్వహిందూ పరిషత్‌ తమకు అండగా నిలబడటం కొండంత బలాన్ని ఇచ్చిం దని అభిప్రాయపడ్డారు. విశ్వహిందూ పరిషత్‌ అంటే తమ కుటుంబమని పేర్కొన్నారు. దాడి చేసిన దుండగులను దేవుడే చూసుకుంటాడని పేర్కొన్నారు. దాడి ఘటనలో తనను చిత్ర హింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తాను సంయమనం పాటించి, ద్రోహులను, అరాచక శక్తులను చట్టానికి పట్టించాలని చెప్పారు. తాను సంయమనం కోల్పోయి ఉంటే, పరిస్థితి మరోలా ఉండేదని వివరించారు. ఏది ఏమైనా విశ్వహిందూ పరిషత్‌ ధర్మకర్యం మరింత పెరగాలని సూచించారు. ఈ సందర్భంగా రంగరాజన్‌కి పూలమాలలు వేసి నాయకులు అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ రామ్‌ సింగ్‌, డాక్టర్‌ సునీత రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతల వెంకట్‌ రెడ్డి, ప్రచార ప్రసార ప్రముఖ్‌ పగుడాకుల బాలస్వామి, మాతృ శక్తి రాష్ట్ర కన్వీనర్‌ పద్మశ్రీ, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్‌ వాణి సక్కుబాయి, డాక్టర్‌ ప్రేమలత, అనంతగిరి జిల్లా ఉపాధ్యక్షులు రంగనాథ్‌, నాయకులు నందకిషోర్‌, మధుసూదన్‌ రెడ్డి, హరినాథ్‌ పాల్గొన్నారు.

Latest News

మల్క కొమరయ్య ని ఆశీర్వదించండి..

పిలుపునిచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్.. ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు నిర్వహించిన మున్నూరు కాపు సంఘం.. ఉపాధ్యాయ సమ్మేళనంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.. ఉపాధ్యాయుల సమస్యలను గాలికి వదిలేసిన బీఆర్ఎస్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS