- కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు
- పార్టీ కోసం కష్టపడే వారిని బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలు గుర్తించావు..
- ఓవైసీ వార్నింగ్స్ కు కాంగ్రెస్ బయపడుతుంది
- 2028లో అధికారంలో వచ్చేది బీజేపీ పార్టీయే
కాంగ్రెస్,బీఆర్ఎస్,ఎంఐఎం పార్టీలపై కేంద్రమంత్రి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ కోసం కస్టపడే వాళ్ళను కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు గుర్తించావు అని ఆరోపించారు.శుక్రవారం నాగోల్ లో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ వర్క్ షాప్ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సంధర్బంగా బండిసంజయ్ మాట్లాడుతూ,రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఒక్కో ఒవైసీ బిల్డింగ్ కు ఒక్కో బుల్డోజర్ ను పెట్టేదాని వ్యాఖ్యనించారు.ఓవైసీ వార్నింగ్స్ కు కాంగ్రెస్ పార్టీ బయపడుతుందని విమర్శించారు.మజ్లిస్ పార్టీ పీడ విరగడ కావాలంటే ఓల్డ్ సిటీలో బీజేపీ సభ్యత్వం పెరగాలని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కార్యకర్తల పై కేసులు పెట్టి హింసించిందని,బీఆర్ఎస్ పార్టీను ఎట్టి పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.2028లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుందని,ఆర్టికల్ 370ను రద్దు చేసిన గొప్ప నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని తెలిపారు.ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.భారతీయ జనతా పార్టీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ భారత దేశాన్ని 07 ముక్కలు చేసేదని విమర్శించారు.కార్యకర్తల త్యాగల పునాదుల మీద బీజేపీ నిర్మాణం జరిగిందని అన్నారు.సభ్యత్వం కోరే హక్కు కేవలం బీజేపీ పార్టీకే ఉందని తెలిపారు.