Saturday, November 23, 2024
spot_img

కాలుష్య కోరల నుంచి కాపాడండి

Must Read
  • మా భూమిలోకి వ్యర్థ జలాలు వదులుతున్నారు
  • నాశనమవుతున్న పంట పొలాలు
  • సంతాని బావితోపాటు, వ్యవసాయ బోర్లు నష్టపోయాను
  • రెడ్డిస్ ల్యాబోరెటరీస్ నుంచి వెలువడుతున్న వ్యర్ధజలాలు అపారనష్టం
  • నల్గొండ జిల్లా పెద్దదేవులపల్లికి చెందిన మల్లయ్య కాలుష్య బోర్డుకు లేఖ

తన వ్యవసాయ భూమిలో కాలుష్య కోరల్లో చిక్కుకుపోతుందని నల్గొండ జిల్లా త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన సింగం మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. డా.రెడ్డీస్ ల్యాబోరెటరీస్ నుంచి వెలువడుతున్న కాలుష్య జలాలు, వ్యర్థ పదార్ధాలు రావడం మూలంగా తీవ్ర నష్టపోతున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా, త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ – 901/2, 902/2 లో 2.26 ఎకరాల వ్యవసాయ భూమిలో డా.రెడ్డిస్ ల్యాబోరెటరీస్ టిఓ 05 సంస్థ కాలుష్య వ్యర్థ జలాలను అక్రమంగా వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ నల్గొండ జిల్లా కాలుష్య నియంత్రణ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కాలుష్య వ్యర్థ జలాల కారణంగా తమ మాగాణి పొలంలో నెల కాలుష్యం చెంది పంట దిగుబడి తగ్గుతుందని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన సింగం మల్లయ్య తన నల్గొండలోని కాలుష్య బోర్డుకు లేఖ రాశారు. మా తండ్రి సింగం అంజయ్య తండ్రి చంద్రయ్య వయస్సు 90 సంవత్సరాలు. నర్సింహులగూడెం శివారులోని సాంతాని కుంట” కింద సర్వే నెం 29/ఇ లో ఎకరాలు 0.0500 గుంటలు 30/ ఈ లో ఎకరాలు 0.0500 గుంటలు 31 ఈ లో ఎకరాలు 0,1000 గుంటలు భూమి ఉంది. అదేవిధంగా పెద్దదేవులపల్లి శివారు లోని సర్వే నెం. 82511/1/2 లోనా భార్య సింగం జయమ్మ పేరుపై 0,1000 ఎకరాలతో పాటు నా తమ్ముడి భార్య సింగం అరుణ పేరుపై సర్వే నెం. 825/2/2 లో 0,0100 గుంటల భూమి ఉంది. ఇట్టి భూమిపై డా.రెడ్డీస్ ల్యాబోరెటరీస్ టీవో-5″ (1985) 500 కాలుష్య వ్యర్ధ బలాలను అక్రమంగా వదులుతున్నారు అని చెప్పారు. దాని కారణంగా మా యొక్క మాగాణి పొలంలో నేల కాలుష్యం చెంది పంట దిగుబడి తగ్గడంతో పాటు పురాతన కాలం నాటి సాందాని బావి, సాంతాని కుంట మరియు 2 వ్యవసాయ బోర్లను నష్టపోయినట్లు వివరించారు. గత 20 సంవత్సరాలుగా ఈ విషయం గురించి పోరాడుతున్నప్పటికీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇట్టి విషయంలో సదరు కంపని యజమాన్యాన్ని నిలదీస్తే సదరు కంపని వారు మాడ్గులపల్లి పోలీసులతో కలిసి మా పై బెదిరింపులకు దిగి ఎన్నో విధాలుగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయాడు. వెంటనే అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలనీ సింగం మల్లయ్య లేఖ డిమాండ్ చేశారు.

Latest News

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS