Thursday, November 21, 2024
spot_img

ఆ మూడు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశాయి

Must Read
  • జమ్ముకశ్మీర్ లో పర్యటించిన ప్రధాని మోదీ
  • కాంగ్రెస్,నేషనల్ కాన్ఫరెన్స్,పిడీపీ పార్టీల పై తీవ్ర విమర్శలు
  • మూడు పార్టీల స్వార్థం వల్ల కశ్మీర్ ప్రజలకు పెను నష్టం జరిగింది
  • యువత చేతుల్లో రాళ్ళు పెట్టారు
  • జమ్ముకశ్మీర్ పై కుట్రలు చేసే ప్రతి ఒక్క శక్తిని ఓడించి తిరుతాం : మోదీ

సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్,నేషనల్ కాన్ఫరెన్స్,పిడీపీ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారని ప్రధాని మోదీ విమర్శించారు.గురువారం జమ్ముకశ్మీర్‎లో పర్యటించారు.ఈ సంధర్బంగా కాంగ్రెస్,ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ మూడు పార్టీల స్వార్థం వల్ల కశ్మీర్ ప్రజలకు పెను నష్టం జరిగిందని,వారి ప్రయోజనాల కోసం పిల్లల భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు.గాంధీ,ముఫ్తీ,ఒమర్ అబ్దుల్లా కుటుంబాలు వారు కాకుండా,ఇంకెవరిని కూడా రాజకీయాల్లోకి రానిచ్చేవారు కాదని,యువత చేతుల్లో రాళ్ళు పెట్టరాని విమర్శించారు.1980లో ఎం జరిగిందో మర్చిపోయారా అని ప్రశ్నించారు.జమ్ముకశ్మీర్ పై కుట్రలు చేసే ప్రతి ఒక్క శక్తిని ఓడించి తిరుతామని తెలిపారు.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ లో అభివృద్ది వేగంగా జరుగుతుందని,యువతకు ఉపాధి అవకాశాలు లాభిస్తున్నాయని వెల్లడించారు.మరోవైపు జమ్ముకశ్మీర్ లో భారీగా ఓటింగ్ శాతం నమోదు కావడం పై మోదీ హర్షం వ్యక్తం చేశారు.ప్రజలు ఎలాంటి భయం లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని,రెండో విడతలోనూ ఎక్కువ మంది పాల్గొని సరికొత్త రికార్డులు సృష్టించాలని పేర్కొన్నారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS