Friday, September 20, 2024
spot_img

తెలంగాణ గాన కోకిల’ బెల్లి లలిత వర్ధంతి నేడు

Must Read

తెలంగాణ అనే పదమే నిండు అసెంబ్లీ లో నిషేదాజ్ఞాలకు గురైన రోజులవి…వలసాంధ్ర పాలకులపై తెలంగాణకు చేస్తున్న అన్యాయాలను దైర్యంగా తన ఆటల,పాటల ద్వార ఎండగడుతూ తెలంగాణ ఉద్యమానికి ఉపిరిపోసి ప్రజలల్లో చైతన్యాన్ని రగిల్చిన వీర మహిళ,తెలంగాణ గానకోకిల బెల్లి లలిత. బెల్లి లలిత చిన్ననాటి నుండే అనేక కష్టాలు పడింది. కుటుంబ ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ప్రాధమిక విద్యను కూడ పూర్తి చేయకుండా భువనగిరిలో ఉన్న స్పిన్నింగ్ మిల్లులో కూలీగా చేరింది.సామాజిక రుగ్మతలను చూసి చలించిపోయింది.యువత చెడు అలవాట్లు సార,గుట్కా,సిగరేట్లకు బానిసలుగా మారి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని వారికి తన పాటల ద్వార చైతన్యాన్ని నింపింది.సార,గుట్కా,వ్యభిచార వ్యతిరేక ఉద్యమాలు నడిపింది.అణగారిన కులాల హక్కులకై బడుగు,బలహీన వర్గాల రాజ్యధికారం కోసం సబ్బండ కులాల గొంతుకై నిందించింది. 1997 మార్చిలో జరిగిన మొట్టమొదటి ‘దగాపడ్డ తెలంగాణ’ సభను విజయవంతం చేయడంలో బెల్లి లలిత ముఖ్యపాత్ర పోషించింది.రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నినాదం గురించి చాటుమాటుగా చర్చించుకుంటున్న సందర్భంలో మొట్టమొదటి బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోసిన కృషిలో బెల్లి లలిత పాత్ర ఎనలేనిది. వరంగల్,మెదక్,మహబూబ్ నగర్ జిల్లలో జరిగిన సభలల్లో తెలంగాణ వలసాంధ్ర పాలకులు చేస్తున్న అన్యాయం తెలంగాణ సహజ వనరులను, సంపదను ఏవిధంగా దోచుకుంటున్నారో వాటిని పాటలు కట్టి సామాన్యులకు అర్ధం అయ్యేలా చేసి వారిని ఉద్యమంలో భాగస్వామ్యం చేసింది.తెలంగాణ కళామండలి రాష్ట్ర కో-కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ పాటే జీవితంగా ఎంచుకున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే..తెలంగాణ ఉద్యమానికి జవ జీవాలు పోసింది బెల్లి లలిత.

ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ…పాలకులను నిలదీసింది బెల్లి లలితను చూసి వలసాంధ్ర పాలకుల వెన్నులో వణుకు పుట్టింది. మొత్తంగా తనలాంటి శ్రామిక ప్రజలు, జాతి జనుల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడింది. ఇది పాలకులకు కంటగింపు అయ్యింది. రాజ్యం కక్ష గట్టి కత్తి నూరింది. కాలికి గజ్జె కట్టి ఆటఆడి పాట పాడినందుకు 1999 మే 26న పాడిన గొంతును తెగ నరికింది శరీరాన్ని 17 ముక్కలు చేసింది. బెల్లి లలితను హత్య చేసి తెలంగాణ నినాదాన్ని, వాదాన్ని రూపు మాపవచ్చని పాలకులు కుట్రపూరితంగా హత్యచేశారు. ఈ దుర్మార్గాన్నంతా కొంతమంది వ్యక్తులపై నెట్టేసి తన చేతుల రక్తపు మరకలను దాచుకునేందుకు ప్రభుత్వం ప్రయ త్నం చేసింది. కొంత మంది అమాయకంగా ఇదినిజమేనని నమ్మారు కూడా. కానీ.. ఇది పచ్చి అబద్ధం. ఇది రాజ్యం చేసిన హత్య. రాజ్యం కొంతమందిని ఆయుధాలుగా వాడుకుని తప్పించుకున్నది ప్రజలు నెమ్మదిగానైనా నిజాన్ని గుర్తించారు. పాలకుల కుట్రలను ఓడించారు. బెల్లిలలిత గొంతును తెగనరికి తెలంగాణ పాటను ఆపామని కలగన్న పాలకులకు కోట్ల గొంతులలో తెలంగాణ పాట హోరెత్తుతున్నది. వలసపాలకులు పారిపోక తప్పని పరిస్థితి తెస్తున్నది. ఇదంతా.. బెల్లి లలిత త్యాగాల్లోంచి వచ్చిన వారసత్వమే. బెల్లి లలిత జీవితం, త్యాగం ఒక ఎత్తు అయితే ఆ కుటుంబంపై జరిగిన దాడి, హింస భయంకరమైనది.ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న రాజ్యం రక్తదాహానికి పచ్చని గూడు కకావికలమైంది.నాటి బెల్లి లలిత ఉద్యమస్పూర్తితో,రగల్చిన చైతన్యంతో పోరాడి తెచ్చుకున్నాము.తెలంగాణ..బెల్లి లలితక్క భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెలో శాశ్వతంగా నిలిచేవుంటారు.

  • మీనుగు రఘుపతి,సంస్థాన్ నారాయణపురం,
    బోయ హక్కుల పోరాట సమితి (అధికారప్రతినిధి),

సెల్ నెం.9553808855.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This