Friday, November 22, 2024
spot_img

కమిషనర్ బాటలోనే టీపీవో

Must Read
  • ఏసీబీకి చిక్కిన కమిషనర్ రాజ మల్లయ్య
  • దమ్మాయిగూడ మున్సిపాలిటీ అంతా అవినీతిమయం
  • మాముళ్ల మత్తులో మున్సిపల్ అధికారులు
  • అక్రమ నిర్మాణాలకు ఫుల్ సపోర్ట్
  • టీపీవో శ్రీధర్ నేతృత్వంలోనే కమిషనర్ అవినీతి
  • ఆయనపై కూడా ఏసీబీ దృష్టిసారించాలి
  • ఆస్తులు, అక్రమ సంపాదనపై ఎంక్వైరీ జరపాలి
  • అవినీతిరహిత మున్సిపాలిటీగా మార్చాలని ప్ర‌జ‌ల డిమాండ్
  • అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో టీపీవో శ్రీధ‌ర్ బ‌దిలీ

దమ్మాయిగూడ మున్సిపాలిటీ అక్రమాలకు అడ్డగా మారింది. మున్సిపాలిటీ పరిధిలో యధేచ్చగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎంతో మంది అక్రమార్కులు భూ ఆక్రమణలు చేస్తున్న అధికార యంత్రాంగం వాళ్లకు వంతపాడుతుంది. మున్సిపాలిటీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణే దమ్మాయిగూడ సర్వే నంబర్ 464లో ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనులు చేపడుతున్నా కూడా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. మున్సిపాలిటీకి కూత వేటు దూరంలో ఉన్న ఈ నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే దీనిపై ఆదాబ్ లో కథనం రావడంతో మేల్కొన్న కమిషనర్ నోటీసులు ఇస్తామని బుకాయించాడు. అధికారులు మాముళ్ల మత్తులో జోగుతూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అక్రమ నిర్మాణాలకు ఆధ్యులు :

గత మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య, టీపీవో శ్రీధర్‌లు అక్రమార్జనే ద్యేయంగా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇటీవల ఓ వ్యక్తి వద్ద తాజాగా దమ్మాయిగూడ మున్సిపాలిటీ కమిషనర్ రాజమల్లయ్య లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. దమ్మాయిగూడ సర్వే నంబర్ 464లో ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ భవన నిర్మాణం చేపడుతున్నా కూడా కమిషనర్, టీపీవోలు భారీగా ముడుపులు తీసుకోవడం కారణంగానే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న టీపీవో శ్రీధర్ పైన కూడా ఏసీబీ దాడులు నిర్వహించాలని దమ్మాయిగూడ ప్రజలు కోరుకుంటున్నారు.

కమిషనర్ రాజమల్లయ్య బాటలోనే టీపీవో శ్రీధర్ :

దమ్మాయిగూడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అధికారులపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మొన్న అనిశాకు చిక్కిన రాజ మల్లయ్య, ప్రస్తుత టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ఇద్దరూ కలిసి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలు చేసే వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తూ పనిచేసుకునేందుకు సహకరించేవారని తెలుస్తోంది. ఇద్దరి నేతృత్వంలోనే ఎన్నో అక్రమాలు జరిగినట్లు గుసగుస వినపడుతోంది. టీపీవో శ్రీధర్ సహా మరికొందరూ లంచాలు తీసుకోవడంలో దిట్ట అని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీళ్లంతా కలిసి దమ్మాయిగూడ మున్సిపాలిటీని అవినీతిమయం చేశారని చెబుతున్నారు.

టీపీవో శ్రీధర్ అక్రమ సంపాదనపై ఎంక్వైరీ జరపాలి

దమ్మాయిగూడ మున్సిపాలిటీనీ అవినీతిమయంగా మార్చిన గత మున్సిపల్ కమిషనర్ కు సహకరిస్తూ ఆయనతో కలిసి పనిచేసిన టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ సహా పలువురు అధికారులపై కూడా అవినీరోధక శాఖ దృష్టిసారించాలి. అక్రమాలకు పాల్పడి కోట్లల్లో కూడబెట్టిన అక్రమ సంపాదనపై ఏసీబీ ఎంక్వైరీ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న పైసల కోసం కక్కుర్తి పడుతూ లంచాలకు తెగబడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. కాగా, గ‌త కొద్ది రోజులుగా ద‌మ్మాయిగూడ మున్సిపాలిటీలో అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో త‌న విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌నే భ‌యంతో టీపీవో శ్రీధ‌ర్ బ‌దిలీ చేయించుకున్న‌ట్లు స‌మాచారం.. ఏసీబీకి చిక్కిన కమిషనర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని, అలాగే దమ్మాయిగూడ మున్సిపాలిటీలో టీపీవో గా పనిచేసిన శ్రీధర్ పై ఎంక్వైరీ జరపాలని కోరుతున్నారు. మున్సిపాలిటీని అవినీతిరహితంగా మార్చాలని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఆరోప‌ణ‌ల‌పై టీపీవో శ్రీధ‌ర్ వివ‌ర‌ణ కోసం ఆదాబ్ ప్ర‌తినిధి ఫోన్, మేసెజ్ చేయ‌గా టీపీవో ద‌గ్గ‌ర నుండి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం..

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS