- మాజీ ఉప రాష్ట్రపతిని కలిసిన బీఆర్ నాయుడు
- హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి సమావేశం
- తితిదే ఛైర్మన్ గా నియామకమైనందుకు మర్యాద పూర్వక భేటీ
- బీఆర్ నాయుడుకు శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్య
టీటీడీ కొత్త ఛైర్మన్ గా నియామకం అయిన బీఆర్ నాయుడు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసింది. టీటీడీ నూతన ఛైర్మన్గా టీవీ 5 న్యూస్ ఛానల్ ఛైర్మన్ బాలినేని రాజగోపాల్ నాయుడు నియమితులైన సంగతి తెలిసిందే. కాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు.. వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. కాసేపు ఇద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమితులైన సందర్భంగా బీఆర్ నాయుడుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.