వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం అంబేద్కర్ నగర్ గ్రామ శివారులో పిడుగుపాటుకు ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఇదే గ్రామానికి చెందిన వంశీ ,హనుమాన్ అనే ఇద్దరు యువకులు సాయంకాల వేళ గ్రామ శివారులో గుట్టపై సేద తీరేందుకు వెళ్లారు వారికి సమీపంలోనే భారీ శబ్దంతో పిడుగు పడింది.ఇందులో ఒకరైన వంశీకి ప్రథమ చికిత్స అందించగా మరో వ్యక్తి హనుమాన్ ను మెరుగని చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా ఆ యువకుని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.