నిరుద్యోగం,ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద సమస్య. సమస్యల్లో ప్రథమ స్థానం సంపాదించుకున్నది కూడా నిరుద్యోగమే. ముందు, ప్రస్తుతం, భవిష్యత్తులో గానీ ఈ నిరుద్యోగ సమస్య వదిలే పరిస్థితి కనిపించడం లేదు. అందరినీ వేధిస్తున్న సమస్య ఇది.పని చేసే వయసు, కోరిక, సామర్థ్యం ఉండి కూడా పని దొరకకపోవడమే నిరుద్యోగం.అలా అని సామర్థ్యం ఉండి పని చేయాలని ఆలోచన ఉండి, అంగవైకల్యంతో ఉన్నవారు నిరుద్యోగులు మాత్రం కాదు.అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా నిరుద్యోగం సమస్యగానే మారిపోయింది. నిరుద్యోగం అనేది సమస్యకే ఒక పెద్ద సమస్య.నిరుద్యోగం వల్ల కొందరు నక్సల్స్ గా,సంఘ ద్రోహులుగా మారుతున్నారనేది వాదన.అయితే నీళ్లు,నిధులు, నియామకాలతో ఏర్పడిన రాష్ట్రంలో పదేళ్లు బీఆర్ఎస్ పాలనలో నియామకాలపై పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. నీళ్లు ఇచ్చారు నిధులు కోసం పాటు పడ్డారు కానీ కొత్త ఉద్యోగాలు,నిరుద్యోగం కట్టడి ప్రయత్నాలు ఏమాత్రం చేయలేదు.ప్రతి రాజకీయ పార్టీకి నిరుద్యోగం మెయిన్ ఎజెండా అయిపోయింది.ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి.నిరుద్యోగులకు ఉద్యోగ మంత్రం ప్రతి రాజకీయ పార్టీ వదులుతూనే ఉంది.అయితే బీఆర్ ఎస్ పై నిరుద్యోగులకు నమ్మకం సన్నగిల్లింది.ఉద్యోగాల విషయంలో బిఆర్ఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ పేపర్ లీకేజీలు,పరీక్ష నిర్వహణ లోపం నిరుద్యోగుల్లో మరింత అసంతృప్తిని పెంచింది.బిఆర్ఎస్ తీరుపై బీజేపీ,కాంగ్రెస్,వైయస్సార్ టిపితో పాటు అన్ని రాజకీయ,సంఘాల నేతలు విమర్శించారు.కొన్ని పార్టీలు అయితే నిరుద్యోగుల కోసం మార్చ్ లు కూడా చేశాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలం,కొత్త ఉద్యోగాలు సృష్టించకుండా మోసం చేసిందని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రధాన ఎజెండే నిరుద్యోగం కావడంతో ఇక నిరుద్యోగులకి పార్టీలు అండగా ఉంటాయని ధైర్యం తోడైంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనేతలు డిక్లరేషన్ ప్రకటించారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రకటనలు చేశారు.దీంతో నిరుద్యోగులు అనుబంధ సంఘాలతో కలిసి గ్రామాలకు వెళ్లి నిరుద్యోగులను,చదువుకున్న వారికి డిక్లరేషన్ వివరించారు.బిఆర్ఎస్ నిరుద్యోగులు పట్ల వ్యవహరిస్తున్న తీరును పబ్లిక్ కి అర్థమయ్యేలా చేశారు.అయితే బీఆర్ఎస్ సర్కార్ మనకి నీళ్లు, నిధులు, పెన్షన్లు ఇస్తోంది.కానీ అది మనకు ముఖ్యం కాదు.మన ఉద్యోగాలు మనకు రావడమే ముఖ్యం అని నిరుద్యోగులు విస్తృత ప్రచారం చేశారు. ధర్నాలు నిరసనలతో విసిగిపోయాం ఇక ఉద్యోగాలు సాధనే మన లక్ష్యం అని నిర్ణయించుకున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ప్రకటించిన కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో కీలకమయ్యారు.అయితే ఇక్కడ సీన్ మళ్లీ రిపీట్ అయింది.కాంగ్రెస్ హామీల్లో భాగంగా గ్రూప్ పోస్టులు పెంచి,డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.గత ప్రభుత్వం అలసత్వం చేసింది.ఈ ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే యువత నిరుద్యోగులుగా ఉండిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.ఏ ధర్నాలు,ఆందోళనలు చేయకూడదు అని అనుకున్నామో.మళ్లీ అవే ధర్నాలు అవే ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి రావడం బాధగా ఉందంటున్నారు.అసలు నిరుద్యోగమే ఉద్యోగంగా,ధర్నాలు- నిరసనలు చేయడమే మా పనిగా అయిపోయింది. మళ్లీ దీనిపై ప్రతిపక్షాలు మా సమస్యను తీర్చాలని మొక్కుబడిగా చెప్తున్నారు గానీ సమస్యలకు పరిష్కారం మాత్రం వచ్చేలా చూడటం లేదు. మళ్ళీ వాళ్ళ అధికారానికి మేము ఏ విధంగా ఉపయోగపడతామో అన్న ఆలోచన చేస్తున్నారు.నిరుద్యోగులు అంటే ఈజీగా మోసం చేయొచ్చు.అధికారంలోకి రాకముందు హామీ ఇచ్చి.తరువాత మభ్యపెడితే సరిపోతుందిలే అన్న భావనతో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ప్రముఖ విద్యావేత్తలు,ప్రొఫెసర్లు కూడా జరిగిన అంశంపై మాట్లాడుతున్నారు.చదువుకున్న వారు సులభంగా మోసపోవడం బాధాకరమని అంటున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల ప్రకటన చేసి..పరీక్ష నిర్వహణ లోపం రావడం ఒక ఘటన అయితే..డిక్లరేషన్ పేరుతో ఇప్పటి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడం మరోచరిత్ర అంటున్నారు.మా న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు అని నిరుద్యోగులు అడుగుతున్నారు.డిక్లరేషన్ను నమ్మి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినా ఎలాంటి ఫలితం రాలేదని వాపోతున్నారు.ప్రశ్నిస్తే గత ప్రభుత్వ మాదిరిగానే ఈ ప్రభుత్వము కూడా మమ్మల్ని జైల్లో పెడుతున్నారు, ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు.ఇది సరైన పద్ధతి కాదని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
నిరుద్యోగుల గోసను చూసి కొందరు మేధావులు,విద్యావంతులు పలు రకాలుగా మాట్లాడుతున్నారు.ఇంత టెక్నాలజీ కాలంలో ఇంకా నిరుద్యోగం అంటూ ప్రభుత్వాలు వస్తున్నాయంటే.చదువుకున్న నిరుద్యోగులదే తప్పు అంటున్నారు మేధావులు.పార్టీలు పదవిలోకి రావడం కోసం నిరుద్యోగులను అడ్డం పెట్టుకోవడం కామన్ అయిపోయిందని అంటున్నారు విద్యావంతులు.నిరుద్యోగులు ఎందుకు పరిశీలన చేసుకోవడం లేదు.గత ప్రభుత్వంలోని తప్పులు ఇప్పటి ప్రభుత్వం లో కూడా రిపీట్ అవుతుంది.అసలు ప్రభుత్వ లక్ష్యం ఏంటి? ఆ ప్రభుత్వం తీస్తున్న ఉద్యోగాల్లో నిజమెంత? రెండు లక్షలు ఉద్యోగాలు ఉన్నాయా… ?ఉంటే చూపించాలి ?లేకపోతే ఎలా ఇస్తామనుకుంటున్నారు? అనే దానిపై నిరుద్యోగులకు స్పష్టత అవసరం ఎంతైనా ఉందని విద్యావంతులు చెబుతున్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగమే ఉద్యోగం.ధర్నాలు, ఆందోళనలే వాళ్ళ పని అన్నట్లుగా పార్టీల వ్యవహర తీరును నిరుద్యోగులు తెలుసుకోలేకపోతున్నారని విద్యావంతులు చెబుతున్నారు. ఉద్యోగ భర్తీ విషయంలో ప్రభుత్వాలు కాలయాపన చేసి నిరుద్యోగితను పరోక్షంగా పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీన్ని నిరుద్యోగులు ఎదుర్కొనే పరిస్థితి లేదు రాదని అంటున్నారు.
ఇక నిరుద్యోగం పెరిగిందా? తగ్గిందా ? ఎంత శాతం ఉంది? అనేది పక్కన పెడితే… అసలు నిరుద్యోగం అంటే ఉద్యోగం లేకపోవడం మాత్రమే. అంతేగాని అంతా కోల్పోయామని కాదు. చదువుకు అనుగుణంగా మన ఉద్యోగాలను మనమే క్రియేట్ చేసుకునేలా ఈ టెక్నాలజీ కాలంలో చాలా అవకాశాలు ఉన్నాయి అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారు ఉన్నారు. ఇదే నిరుద్యోగితపై ఉద్యోగంలో ఉంటూ ఫైట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిరుద్యోగులు ప్రభుత్వాలపై ఎంతకాలం ఆధారపడి పోరాటం చేసినా కాలం పోతుందే తప్ప ప్రభుత్వాల తీరులో ఏమాత్రం మార్పు ఉండదు. మనదేశంలోనే వ్యక్తులు కొందరు పక్క దేశాలకు వెళ్లి అక్కడ తమ సామర్థ్యాన్ని నిరూపించుకొని సంతోషంగానే ఉన్నారు. వాళ్ళు ఏ ప్రభుత్వ ఉద్యోగులపై ఆధారపడలేదు. ఉద్యోగుల కోసం ఎదురు చూసి సమయాన్ని వదులుకోలేదు.. ఇప్పటి పరిస్థితుల్లో మనకున్న సామర్థ్యం తో ఏదో ఒక పని చేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలపై సమయాన్ని కేటాయించి పోరాటం చేస్తే కచ్చితంగా ఫలితం అనేది ఉంటుందని చెప్తున్నారు విద్యావంతులు. ఇది చాలా ముఖ్యమైన విషయం ఒకపక్క ఆర్థిక పరిస్థితులు చక్కగా ఉంటాయి… మరో పక్క నిరుద్యోగితపై ఉద్యోగం చేస్తూనే పోరాటం చేసే అవకాశం ఉంటుంది . ఇలా చేస్తే కొంతకాలానికి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు నిరుద్యోగిత అంటే జాగ్రత్తగా ఉండాలనే భయము వాళ్ళల్లో కలుగుతుందని చెప్తున్నారు. నిరుద్యోగుల కోసం మోసపూరిత హామీలు, అధికారంలోకి వచ్చాక మాట మార్చడం లాంటి విధానాలు పై కొంత మేరకు ఆలోచన చేసే పరిస్థితి ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు వస్తుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో జరిగిన విధానాలు తెలిసి కూడా ఇప్పుడు ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటుంటే… నిజంగా 2 లక్షలు ఉద్యోగాలు ఉన్నాయా ఉంటే బయట పెట్టాలి. ఒకవేళ 2 లక్షలు ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేయాలి. పరిశీలన, స్పష్టత తర్వాతే ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఆధారపడితే బాగుంటుంది…లేదంటే ఇలానే మోసపోవాల్సి వస్తుందనీ ప్రముఖులు విద్యావేత్తలు, మేధావులు తోపాటు ఇతర దేశాల లో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నారు….
ఇక నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలపై ఆధారపడడం తగ్గించి వాళ్ళ నైపుణ్యాల్ని నమ్ముకుంటే మాత్రం మోసానికి గురి కాకుండా ఉండగలుగుతాం. అలాగే ప్రభుత్వాలు ఒక అడుగు వెనకేసి నిరుద్యోగిత కట్టడిపై ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుందనే భావన
పట్ట.హరనాథ్,పిహెచ్ది స్టూడెంట్
8790843009