Thursday, April 3, 2025
spot_img

ఎయిర్ యూరోపా విమానంలో ఊహించని ఘటన

Must Read

ఎయిర్ యూరోపా విమానంలో ఊహించని ఘటన జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఎయిర్‌ యూరోపా కి చెందిన బోయింగ్‌ 787-9 విమానం 325 మంది ప్రయాణికులతో స్పెయిన్‌ లోని మాడ్రిడ్‌ నుంచి మాంటెవీడియోకు బయల్దేరింది.మార్గమధ్యలో ఒక్కసారిగా విమానంలో అల్లకల్లోలం నెలకొనడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.మరో ప్రయాణికుడు ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్ లో ఇరుక్కున్నాడు.విమానంలో ఒక్కసారిగా ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.బ్రెజిల్ లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.ఎలాంటి సమస్య లేకుండా విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని అధికారులు వెల్లడించారు.గాయపడిన వారిని సమీపంలోని ఓ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS