కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అక్టోబర్ 15-16 తేదీల్లో పాకిస్థాన్‌లో పర్యటించునున్నారు. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న ఎస్.సీ.ఓ వార్షిక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సంధర్బంగా ఎస్ .జై శంకర్ మాట్లాడుతూ,కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎస్.సీ.ఓ సభ్యుడిగా ఆ దేశంలో పర్యటిస్తున్నాని, పాకిస్థాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని స్పష్టం చేశారు. పాకిస్థాన్ వల్లే సార్క్ సమావేశాలు ఆగిపోయాయని అన్నారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తొలిసారి భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్ వెళ్తుండటం విశేషం. 2015 లో పాకిస్థాన్ లో జరిగిన కాన్ఫరెన్స్ కు అప్పటి విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్ హాజరయ్యారు.