Thursday, November 21, 2024
spot_img

సీఎం రేవంత్ రెడ్డికు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ

Must Read

కేంద్రమంత్రి బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గ్రూప్ 01 అభ్యర్థులు చివరి క్షణం వరకు ఆందోళన చేస్తున్నారని, పంతానికి పోకుండా జీవో 29ని ఉపసంహరించుకోవాలని అన్నారు. నిరుద్యోగుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని తెలిపారు. 5003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు జీవో 29వల్ల మెయిన్స్ పరీక్షకు దూరం అయ్యారని పేర్కొన్నారు. అభ్యర్థుల ఆవేదనను పరిగణంలోకి తీసుకొని గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు సోమవారం నుండి జరగబోయే గ్రూప్ 01 మెయిన్స్ పరీక్షల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 31,382 మంది అభ్యర్థులు గ్రూప్ 01 మెయిన్స్ పరీక్ష రాయనున్నారు. దీని కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్‎గిరి జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Latest News

రహదారి నిబంధనలు కచ్చితంగా పాటించాలి

నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వ ప్రసాద్‌ రహదారి నియమ నిబంధనలను ప్రతి వాహనదారుడు కచ్చితంగా పాటించాలని హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ విశ్వ ప్రసాద్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS