Tuesday, December 3, 2024
spot_img

గ‌త ప్ర‌భుత్వంలో స‌మ‌స్య‌ల వ‌ల‌యంగా యూనివర్సిటీలు

Must Read
  • జూన్ 2 లోపు ప్రొఫెసర్లను, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ల‌ను నియమించాలి – పి.డి.ఎస్.యు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 లోపు ప్రొఫెసర్లను, రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లను నియమించాలని పి.డి.ఎస్.యు నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలోని న్యూ సెమినార్ హాల్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఎస్. నాగేశ్వర్ రావు , సుమంత్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంచార్జీ పాలనని గతంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇంచార్జీ వీసీలను నియమించడం విద్యార్థి లోకాన్ని విస్మయానికి గురిచేసిందని, తక్షణమే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియామకంపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా నియమించిన వీసీలు ఐ.ఏ.ఎస్ అధికారులుగా ప్రభుత్వం లోనీ ఆయా శాఖలలో బాధ్యతలు నిర్వహించే వారు కావడంతో విశ్వవిద్యాలయాల పరిపాలన బాధ్యతలు జోడుగా నిర్వహించడం విద్యార్థుల సంక్షేమానికి ఆటంకంగా మారుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర విశ్వవిద్యాలయాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 02 లోపు ప్రొఫెసర్లను, వైస్ ఛాన్సలర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలు సమస్యలకు నిలయాలుగా మారాయని, కేసిఆర్ నియమించిన వీసీలు అవినీతికి చిరునామగా, విద్యార్థుల సంక్షేమానికి వ్యతిరేకంగా పాలనా చేసారని మండిపడ్డారు. ప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే నడుస్తుందనే సందేహం కలుగుతుందని అన్నారు. యూనివర్సిటీలో నిరంతరం అందుబాటులో ఉండేవారు వైస్ ఛాన్సలర్లుగా ఉంటే వర్సిటీకి ఉపయోగకరమని , తక్షణమే రాష్ట్రం ప్రభుత్వం ఆ దిశగా అలోచించి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లుగా నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పి. డి.ఎస్.యూ ఓయూ నాయకులు ప్రశాంత్, సంతోష్, కార్తీక్, మధు, సురేఖ, ప్రవీణ్, మహేష్, శ్రీకాంత్, బాలు తదితరులు పాల్గొన్నారు.

Latest News

శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS