Friday, September 20, 2024
spot_img

100కి నగరాల్లో యుపీఎస్‌సీ అభ్యాస్ ప్రిలిమ్స్‌

Must Read
  • విజన్ ఐఏఎస్ కు విశేష స్పందన
  • దేశవ్యాప్తంగా 28వేల మంది
  • హైదరాబాద్‌లో వెయ్యి మంది విద్యార్థులు హాజరు

ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ టీచింగ్‌లో అగ్రగామి సంస్థ అయిన విజన్ ఐఏఎస్, భారతదేశంలోని 100కి పైగా నగరాల్లో యుపీఎస్‌సీ అభ్యాస్ ప్రిలిమ్స్ నిర్వహించింది. యుపీఎస్‌సీ అభ్యాస్ ప్రిలిమ్స్ ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ (హైదరాబాద్‌లోని ఆఫ్‌లైన్ సెంటర్) లో జరిగింది. హైదరాబాద్‌లో 1,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 28,000 మందికి పైగా దీనిలో పాల్గొన్నారు. మే 26, 2024న దీనిని నిర్వహించింది. హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, ఢిల్లీ, గౌహతి, జైపూర్, జోధ్‌పూర్, లక్నో, ప్రయాగ్‌రాజ్, పూణే, రాంచీ సహా పలు నగరాల్లోని వివిధ కేంద్రాలలో పరీక్ష జరిగింది. యుపిఎస్‌సి ప్రిలిమ్స్ పరీక్ష యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రయాణానికి నాంది పలుకుతుంది. దీని ప్రాముఖ్యతను గుర్తిస్తూ, ఆబ్జెక్టివ్ థింకింగ్ మరియు రీజనింగ్ స్కిల్స్‌ను విశ్లేషించడంలో, పెంపొందించడంలో ఔత్సాహికులకు సహాయపడేందుకు గాను విజన్ ఐఏఎస్ ప్రతిసారి అభ్యాస్ ప్రిలిమ్స్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా విజన్ ఐఎఎస్, హైదరాబాద్, బ్రాంచ్ హెడ్, హరేకృష్ణ సింగ్ మాట్లాడుతూ.. ‘యుపిఎస్‌సి అభ్యర్థులకు ఇది సంతోషకరమైన రోజు అన్నారు. దేశవ్యాప్తంగా 100కి పైగా పరీక్షా కేంద్రాలలో అభ్యాస్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ 3లో హాజరైన అభ్యర్థులకు విజన్ ఐఎఎస్ మంచి కల్పించిందన్నారు. వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులు నిజమైన యుపిఎస్‌సి ప్రిలిమ్స్ అనుభవాన్ని పొందేలా రూపొందించబడిన వాతావరణంలో తమకు కేటాయించిన కేంద్రాలలో పరీక్ష రాశారన్నారు. ఇది వారి పరీక్ష సంసిద్ధతను పరీక్షించటంతో పాటుగా జాతీయ స్థాయిలో తులనాత్మక విశ్లేషణను అందిస్తుందని చెప్పారు. కఠోరమైన అభ్యాసం ద్వారా ఆశావహులకు మార్గనిర్దేశం చేయడంలో ఈ సిరీస్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. వారి బలాలు గుర్తించటం, అభివృద్ధి చేసుకోవాల్సిన అంశాలను వెల్లడించింది. ప్రారంభించినప్పటి నుండి, అభ్యాస్ దేశవ్యాప్తంగా యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో రాణించాలనే లక్ష్యంతో వున్న అందరినీ ఏకం చేస్తుంది ఆయన పేర్కొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This