- ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్
తెలంగాణలోని యూనివర్సిటీల వీసీల కాలం ముగిసి దాదాపు 03 నెలలు కావస్తున్న ఇప్పటివరకు వీసీలను నియమించకపోవడం సిగ్గుచేతని విమర్శించారు ఏబీవీపీ స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్ జీవన్.శుక్రవారం ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సంధర్బంగా జీవన్ మాట్లాడుతూ, వీసీలను నియమించకుండా ఇంచార్జీ వీసీలతో కాలయాపన చేస్తూ యూనివర్సిటీల మనుగడకే ముప్పు తీసుకొని వస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యూనివర్సిటీలకు మహర్దశ తీసుకొని వస్తాం,పునర్జీవం పోస్తామని డబ్బా కొట్టారు,కానీ ప్రభుత్వం ఏర్పడి 07 నెలలు కావస్తున్న ఇప్పటివరకు యూనివర్సిటీల సంక్షేమం గురించి మాట్లాడిన పాపాన పోలేదని వ్యాఖ్యనించారు.ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యకు అరకొర నిధులు కేటాయించడంతోనే ఈ ప్రభుత్వానికి విద్యారంగం పైన ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందని అన్నారు.యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 82 % టీచింగ్,నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్యక్రాంతమవుతున్న యూనివర్సిటీ భూములను కాపాడాలని,అశాస్త్రీయంగా పెంచిన పిజీ,ఇంజనీరింగ్,పిహెచ్డి ట్యూషన్,ఎగ్జామ్ ఫీజులను తగ్గించాలని కోరారు.అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి మెరుగైన హాస్టల్ వసతి కల్పించాలని,సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైస్ చెయ్యాలని డిమాండ్ చేశారు.తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థుల మీద పోలీసులు జులుం ప్రదర్శించారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ,విద్యానగర్ విభాగ్ కన్వీనర్ పృథ్వి తేజ,స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ శ్రీహరి,కమల్ సురేష్, సుమన్ శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.