Friday, April 18, 2025
spot_img

తెలంగాణలో ముగిసిన గ్రామ సభలు

Must Read
  • నాలుగు పథకాల ప్రారంభానికి సిద్దం
  • రైతుభరోసాకు నిధులు సవిూకరణ

రాష్ట్ర వ్యాప్తంగా నేటి వరకు 16,348 గ్రామ/వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది. గత నాలుగు రోజులుగా జరిగిన గ్రామ/ వార్డు సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రభుత్వం ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులు అందచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా గ్రామ సభలు 12,861, వార్డు సభలు 3,487 మొత్తం 16,348 నిర్వహించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ గ్రామ సభలలో పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు. ఇకపోతే రైతు భరోసా లెక్క తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు 1.49 కోట్ల ఎకరాలు ఉన్నట్టు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వీటికి సీజన్‌ కు ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం రూ.8,900 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది. రైతు భరోసా కోసం ప్రభుత్వం నిధులు రెడీ చేసుకున్నది. ఇప్పటికే రూ.10 వేల కోట్ల మేర సేకరించింది. ఇందులో రైతు భరోసాకు అవసరమైన రూ.8,900 కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఏకకాలంలో కాకుండా ఎప్పటిలాగే విడతల వారీగా రైతు భరోసాను ప్రభుత్వం జమ చేయనుంది. ఎకరాకు రూ.6 వేల చొప్పున కోటి 49 లక్షల ఎకరాలకు ఇస్తే రూ.8,900 కోట్లు అవుతున్నది. గతంతో పోలిస్తే ఇది దాదాపు రూ.1,500 కోట్లు ఎక్కువ. ఏయే గ్రామాల్లో సాగుకు యోగ్యంకాని భూముల డిజిటల్‌ బ్లాకింగ్‌ పూర్తయిందో, ఆ గ్రామాల్లో ఎకరా వరకు భూములున్న రైతులకు ఈ నెల 26న పెట్టుబడి సాయం అందనుంది. ఇలా విడతల వారీగా పూర్తి స్థాయిలో నిధులను 15 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే టీజీబీలో ఏపీజీవీబీ విలీనం నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం జమ చేస్తే టెక్నికల్‌ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఒకవేళ ఈ నెల 25 కల్లా ఆ బ్యాంకు నుంచి క్లారిటీ వస్తే ఆ మరుసటి రోజు యథావిధిగా నిధులు జమ చేస్తామని, లేదంటే ఆ ఖాతాదారులకు తర్వాత జమ చేస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రాళ్లు, రప్పలు, కొండలు, వెంచర్లు, హైవేలు, ఇరిగేషన్‌, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూముల లెక్క తేల్చారు. ఇలాంటివి 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. గ్రామ సభలు నిర్వహించి, ఆ భూముల సర్వే నెంబర్లను ఆన్‌లైన్‌?లో బ్లాక్‌చేస్తున్నారు.

Latest News

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు అవార్డ్

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS