- కాలువ కబ్జాపై నోటీసులు జారీ
- పైపులు, రోడ్డు, తొలగించకుంటే చర్యలు
- ఆదాబ్ కథనానికి స్పందన
నిజాం కాలం నాటి ప్రభుత్వ చెరువు కాలువ కబ్జాపై నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. అమాయకులే టార్గెట్… 1/70లో అక్రమ వెంచర్.. చెరువు కాలువ కబ్జా చేసి రోడ్డు అంటూ మే 28న ఆదాబ్ హైద్రాబాద్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈకథనంతో నీటిపారుదల శాఖ అధికారులు కదిలారు. నీటిపారుదల శాఖ డిఈ రాంబాబు సర్వే నెంబర్ 137/2అ/ 1/2కు చెందిన సదరు భూ యజమాని దండమూరి రవీందర్ తండ్రి దండమూరి సీతారామయ్య పట్టాదారుకుమారులకు నోటీసులు జారీ చేశారు. అలుగు కాలువలో పైపులతోపాటు పైన మట్టి రోడ్డు వేయడం చట్టరిత్యా నేరమని వెంటనే ఆపైపులతోపాటు మట్టిరోడ్డును తొలగించాలని నోటీసులలో పేర్కొన్నారు. లేనిపక్షంలో 1357ఎఫ్ నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు.