- మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టం
- కఠిన శిక్ష పడేలా చేస్తాం
- మహిళల పై నేరం క్షమించారని నేరం
మహిళల పై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టమని ప్రధాని మోదీ హెచ్చరించారు.ఆదివారం మహారాష్ట్రలోని లాఖ్ పతి దీదీ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ,మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని తెలిపారు.మహిళల భద్రత కోసం కఠిన చట్టాలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వాలు వస్తుంటాయి,పోతుంటాయి కాని ముందు మహిళలను మనం రక్షించుకోవాలని అన్నారు.మహిళలపై నేరం క్షమించారని నేరం,ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోవాలని సూచించారు.ఆసుపత్రులు,పాఠశాలలు,కళాశాలలు,పోలీస్ శాఖలు ఇలా ఎవరి ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.కోల్ కత్తా వైద్య విద్యార్థిని హత్యాచారం,బడ్లపూర్ పాఠశాలలలో జరిగిన ఘటనల నేపథ్యంలో మోదీ ఈ విధంగా స్పందించారు.