Friday, December 13, 2024
spot_img

ఈ ఇంజనీర్ మాకొద్దు

Must Read

(నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారిని సాగనంపండి)

  • ఆయన అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టండి
  • లోపాయికారి ఒప్పందంతో దివీస్ ల్యాబ్ కు అనుకూలంగా నివేదిక
  • ఇంజనీర్ వ్యవహారశైలిపై రైతులు, గీత కార్మికుల ఆగ్రహం
  • చర్యలు తీసుకోవాలంటూ పి.సి.బి.ఉన్నతాధికారులకు ఫిర్యాదు
  • గతంలో అధికారిపై అక్రమ వసూళ్ల ఆరోపణలు..షోకాజు నోటీసులు
  • మూడు జిల్లాలకు మీరు ముగ్గురు…జిల్లాకు నేను ఒక్కడ్నే అంటూ ఝాలుం
  • నల్లగొండ ఈఈ అవినీతి, అక్రమాలపై విచారించండి
  • లేదంటే కోర్టును ఆశ్రయిస్తామంటున్న దివీస్ బాధిత రైతులు

దివీస్ కంపెనీ వల్ల వచ్చే కాలుష్యంతో మనుషులే కాదు, పంట పొలాలు, గాలి, నీరు వాతావరణం అంతా కలుషితమై పోతున్నామని గగ్గొలు పెడుతుంటే కాలుష్య నియంత్రణ మండలి అధికారి పరిశ్రమ యాజమాన్యానికే ఒత్తాసు పలుకుతుండడం దారుణం. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా మాముళ్ల మత్తులో జోగుతూ ప్రజల అనారోగ్యం బారిన పడుతున్నా పట్టనట్లు వ్యవహకరిస్తుండడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీరుగా బదిలీపై వచ్చిన పర్యావరణ ఇంజనీరు. ఓ వైపు మూడు జిల్లాల కలెక్టర్లు పరిశ్రమ యాజమాన్యాలకు, మరోవైపు పరిశ్రమల కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న రైతులు, గీత కార్మికులు ప్రస్తుతం కాలుష్య నియంత్రణ మండలి అధికారి పని తీరుతో విసిగిపోతున్నారు.

లోపాయికారి ఒప్పందంతో దివీస్ కు అనుకూలంగా నివేదిక:

దివిన్ ల్యాబ్స్ కాలుష్యంతో పచ్చని పల్లెలు కాలుష్యకాసారాలుగా మారాయని ఓ వైపు రైతులు, గీత కార్మికులు నిత్యం ఫిర్యాదులతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరిగి తిరిగి వేసారిపోయారు. లక్షల రూపాయలు ఖర్చుచేసి మరీ న్యాయస్థానాలలో కేసులు వేశారు. దివిస్ పరిశ్రమ నుండి 500 కోట్లు నష్టపరిహారం చెల్లించే విధంగా న్యాయం చేయాలని కేసులు వేసి తిరుగుతు ఉ౦టే ప్రస్తుతం కాలుష్య నియంత్రణ మండలి అధికారి దివిస్ ల్యాబ్స్ ఎటువంటి కాలుష్యం లేదని క్షేత్రస్థాయిలో సందర్శించకుండా ఏకపక్షంగా దివిస్ ల్యాబ్ కు అనుకూలంగా నివేదికలు ఇచ్చి గత రెండు సంవత్సరాలుగా ఉత్పత్తులు చేపట్టకుండా మూసివేతకు సిద్ధంగా ఉన్న మారుతి కాటెక్స్ పరిశ్రమలోనే కాలుష్యం వెలువడుతుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ కు తప్పుడు నివేదిక ఇవ్వడంతో కాలుష్య నియంత్రణ మండలి నల్లగొండ ప్రాంతీయ కార్యాలయ అధికారి ఇచ్చిన నివేదికతో న్యాయస్థానం తీర్పులో వెంటనే మారుతి కాటెక్స్ పరిశ్రమను మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ కు దివిస్ ల్యాబ్స్ పరిశ్రమకు అనుకూలంగా నివేదిక రూపొందించడంలో రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెక్షన్ అధికారికి పెద్ద ఎత్తున ప్రయోజనాలు పొందినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

నల్లగొండ పర్యావరణ ఇంజనీరుపై ఫిర్యాదు :

కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీరు నల్లగొండ అధికారి ఏకపక్షంగా దివీస్ ల్యాబ్స్ పరిశ్రమకు అనుకూలంగా నివేదిక ఇవ్వడంతో జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు వేసిన చప్పిడి లింగారెడ్డి కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, యదాద్రి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి అవినీతిపై అక్రమాలపై విచారణ చేపట్టి వెంటనే బదిలి చేయాలని కోరుతూ కంప్లైంట్ చేశారు.

పర్యావరణ ఇంజనీరు అక్రమాలపై విచారించండి :

నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి వచ్చినప్పటి నుండి పరిశ్రమ యాజమాన్యాలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పరిశ్రమలపై వచ్చిన ఫిర్యాదులపై కనీసం విచారించకుండా చర్యలు చేపట్టకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదీలా ఉండగా కాలుష్య నియంత్రణ మండలి అధికారి వచ్చినప్పటి నుండి నిబంధనల ప్రకారం పరిశ్రమలను సందర్శించాల్సి ఉండగా చూసి చూడనట్లు వదిలివేస్తున్నారు. తద్వారా పూర్తిగా నియంత్రణ లోపించడంతో కొన్ని ఫార్మా పరిశ్రమల నుండి పారిశ్రామిక వ్యర్థాలను అడ్డదారిలో తరలిస్తున్నారని తెలుస్తోంది. ఇంతలా వ్యవహరిస్తున్న ఇంజనీర్ పై కంప్లైంట్ చేస్తే ఎవరికీ పట్టడం లేదు. నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి అవినీతి, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే ప్రత్యక్షంగా అక్రమాలకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అక్రమాలకు సహకరిస్తున్నట్టు ఉందని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గతంలోనూ సదరు ఉద్యోగి పనితీరుపై పలు కంప్లైంట్స్ వచ్చాయి. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అధికారి గతంలో హైద్రాబాద్ ప్రాంతీయ కార్యాలయ అధికారిగా పని చేస్తున్నప్పుడు సదరు అధికారిపై పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలపై విమర్శలు, ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేయడం జరిగింది.

అందుబాటులో లేకున్నా..నెలకు లక్ష ఖర్చు :

నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి స్థానికంగా కార్యాలయానికి పది కిలోమీటర్ల పరిధిలో తప్పనిసరిగా నివాసం ఉండాలి. చివరికి జిల్లా కలెక్టర్ అయిన స్థానికంగా ఉండాలి. కానీ పర్యావరణ ఇంజనీరు నిత్యం నల్లగొండ నుండి హైద్రాబాద్ కు వచ్చి వెళ్తున్నారని అందుకు సుమారు లక్ష రూపాయల వరకు అదనపు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. రూపాయలు కాలుష్య నియంత్రణ మండలి బోర్డు భరిస్తుందా లేదా అధికారి స్వంతంగా పెట్టుకుంటున్నాడా… ఉన్నతాధికారులు విచారణ జరపాలి. నల్లగొండ పర్యావరణ ఇంజనీరు స్థానికంగా నివాసం ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు. బయో మెడికల్ ఆసుపత్రులను కాలుష్య నియంత్రణ మండలి అధికారి రెన్యువల్ చేయకపోవడంతో జిల్లా వైద్యశాఖాధికారి సమస్యలను నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారి నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం.

న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం :

నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై చేసిన ఫిర్యాదులపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు అవినీతి, అక్రమాలపై విచారించి తగిన చర్యలు చేపట్టకపోతే న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నామని ఫిర్యాదుదారుడు చప్పిడి లింగారెడ్డి తెలిపారు.

నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలోని గ్రామాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కాలుష్య నియంత్రణ మండలిలో అవినీతి బాగోతాన్ని తరిమికొట్టి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS