కేశవరావుకి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని అనుకుంటున్నామని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం కేశవరావు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.అనంతరం ఇద్దరు కలిసి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇక నుండి కేశవరావు సలహాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని తెలిపారు.తెలంగాణలో మరోసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఎలాంటి గందరగోళం జరగకుండా 11వేలకు పైగా టీచర్లను బదిలీలు చేశామని వెల్లడించారు. అనంతరం కేశవరావు మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన ప్రజస్వామ్యబద్దంగా ఉందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ తన సొంత ఇల్లులాంటిదని,పార్టీ ఎంపీల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని పేర్కొన్నారు.తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.కేవలం ఆరు నెలల్లోనే రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి చూశానని అన్నారు.గత ప్రభుత్వంలో కేవలం ఫ్యామిలీ పబ్లిసిటీ ఉందని విమర్శించారు.నైతిక విలువలతోనే తన పదవికి రాజీనామా చేసానని వెల్లడించారు.
Must Read