- రైతు బజార్లలో రైతులకు అధిక ప్రాధాన్యత…
- రైతులకు, వినియోగదారులకు నష్టం కలగనివ్వం..
- గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి..
రైతు బజార్లలో దళారీ వ్యవస్థకు ప్రమేయం లేదని.. స్టాల్స్ ఉన్న రైతులు పండించిన పంటను నేరుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతు బజార్లలో వినియోగదారులకు అధికారులు సూచించిన ధరలకు అమ్మి నాణ్యమైన కూరగాయలను ఇవ్వాలని గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి అన్నారు. కొత్తపేట రైతుబజార్ ను పాలకవర్గం సభ్యులు మరియు అధికారులతో సందర్శించి ప్రతి రైతు సమస్యలను అడిగి తెలుసుకుని రైతు బజారు వచ్చే వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్తపేట రైతు బజార్ ఎదురుగా రైతులకు నష్టం కలిగేలా సాయంత్రం వేళలో కొంతమంది దళారులు అమ్ముతున్న విషయం రైతులు తమ దృష్టికి తేవడం జరిగిందని అట్టి దళారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తామని తెలిపారు. రైతు బజార్లలో అధికారులు రైతులతో వినియోగదారులతో సమన్వయంతో ఉండాలని సమస్యలు లేకుండా చూసే బాధ్యత అధికారులదేనని తెలియజేశారు. వచ్చే వినియోగదారులకు అమ్ముకునే రైతులకు కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రైతు బజార్లలో ధరల పట్టిక ప్రకారం అమ్మాలని లేనిచో చర్యలు తప్పవన్నారు.. రైతులకు ఏ సమస్య ఉన్న వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తేవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, సభ్యులు బండి మధుసూదన్ రావు, పన్యాల జైపాల్ రెడ్డి, మెగావత్ గణేష్ నాయక్, చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి, దోమలపల్లి అంజయ్య, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్. శ్రీనివాస్, రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్రవంతి తోపాటు సూపర్ వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.