తిరుమల కల్తీ లడ్డూ తయారీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సీట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు చేస్తునట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన అయిన, సీట్ ఏర్పాటు చేసి, రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. టీటీడీని ప్రక్షాళన చేసి, పూర్వవైభవం తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ నేల 23 నుండి మహా శాంతియాగం నిర్వహిస్తామని ప్రకటించారు.