Thursday, April 3, 2025
spot_img

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దాం

Must Read
  • చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
  • చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో కొనసాగాలి
  • సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు కొనసాగుదాం
  • చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అధిక స్థానాల్లో గెలుపొందారు.ఇక పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ తో గెలిచి తోలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.ఎపి ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో వారికీ అభినందనలు తెలియజేసి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో కొనసాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించి,సమస్యలు పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు కొనసాగుదామని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓడిపోవడంతో వైఎస్.జగన్మోహన్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Latest News

మెదక్‌ జిల్లా ముఖ్యనేతలతో కేసీఆర్‌ భేటీ

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS