Friday, November 22, 2024
spot_img

నేతలంతా ఢిల్లీ వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి..?

Must Read
  • రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి డెంగ్యూ,మలేరియా కేసులు పెరిగిపోతున్నాయి
  • ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో ఎం పని
  • వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి ఆసుపత్రులను సందర్శించాలి
  • రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి
  • ప్రభుత్వం హైడ్రా పేరుతో సమస్యలను పక్కదారి పట్టిస్తుంది
  • హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామాను అందరు గమనిస్తున్నారు
  • రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి

రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకి డెంగ్యూ,మలేరియా కేసులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.సిద్ధిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటే కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని నిలదీశారు.వెంటనే రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ రోగులతో నిండిన ఆసుపత్రులను సందర్శించాలని ఈ సందర్బంగా రఘునందన్ రావు డిమాండ్ చేశారు.రోగులకు అందుతున్న వైద్య సౌకర్యాలపై అరా తీసి,మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.ఆసుపత్రుల్లో వెంటనే తగినంత సిబ్బందిని కేటాయించాలని డిమాండ్ చేశారు.ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం హైడ్రా పేరుతో సమస్యలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు.అనంతరం పంచాయితీల ఎన్నికల పై మాట్లాడుతూ,రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ ఎన్నికలు నిర్వహించలేని పక్షంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని తెలిపారు.పంచాయతీరాజ్ శాఖ ద్వారా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కోరారు.హైడ్రా పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న హైడ్రామాను అందరూ గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు.చెరువులను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS