Friday, November 22, 2024
spot_img

పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే తప్పేంటి: సబితా ఇంద్రరెడ్డి

Must Read
  • కేసీఆర్ ఫోటో,గుర్తులను తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టాలి
  • రేవంత్ రెడ్డి పరిపాలన పై దృష్టి పెట్టండి
  • ఏపీలో జగన్ ఫోటో ఉన్న కిట్లనే యధావిధిగా పంపిణి చేయాలనీ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు
  • చంద్రబాబును చూసి రేవంత్ రెడ్డి నేర్చుకోవాలి

పాఠ్యపుస్తకాల్లో మాజీముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో,కేసీఆర్ గుర్తులను తొలగించాలనే ఆలోచనను పక్కన పెట్టి,రేవంత్ రెడ్డి పరిపాలనా పై దృష్టి పెట్టాలని అని అన్నారు మాజీ విద్యశాఖ మంత్రి సబితా ఇంద్రరెడ్డి.తెలుగు పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉండడంతో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పుస్తకాలను తిరిగి తీసుకోవాలని నిర్ణయించింది.దీనికి బాధ్యులైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలను సైతం జారీచేసింది.ఈ ఘటన పై సబితా ఇంద్రరెడ్డి స్పందించారు.

ఈ సందర్బంగా సబితా ఇంద్రరెడ్డి మాట్లాడుతూ,పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరుంటే తప్పేంటని ప్రశ్నించారు.ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం జగన్ ఫోటో ఉన్న కిట్లను యధావిధిగా పంపిణి చేయాలనీ చెప్పింది,ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హుందాగా వ్యవహరించారని అన్నారు.చంద్రబాబును చూసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని హితవు పలికారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పాలనా పై దృష్టి పెట్టలేదని,దానికి ఈ వ్యవహారమే నిదర్శమని తెలిపారు.పాఠ్యపుస్తకాల్లో కేసీఆర్ పేరు ఉందని ఆ పుస్తకాలను వెనక్కి తీసుకోవడం,ఆ పేజీలను చింపేయడం సమంజసమా అని ప్రశ్నించారు.
ఆ పెజుల వెనుక వందేమాతరం,జనగణమన గేయాలు ఉంటాయి,ప్రతిజ్ఞలు ఉంటాయి ఆ విషయంలో రేవంత్ రెడ్డికి పట్టింపు లేదా అనిప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏటా 23లక్షల మంది విద్యార్థులకు రూ.108కోట్లతో రెండు జతల యూనిఫామ్స్,రూ.200 కోట్లతో 1.90 కోట్ల ఉచిత పుస్తకాలను ముద్రించి ఇచ్చామని,ఏ ప్రభుత్వం చేయని విధంగా రూ.34.70 కోట్లతో 11.27 లక్షల మందికి వర్క్ బుక్స్ పంపిణి చేశామని గుర్తుచేశారు.

Latest News

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చు : టీజీపీఎస్సీ

డిసెంబర్ 09 నుండి గ్రూప్ 02 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‎లోడ్ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ తెలిపింది. డిసెంబర్ 15,16 తేదీల్లో గ్రూప్ 02 పరీక్షలు జరగనున్నాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS