- కేసీఆర్ కుటుంబసభ్యులు ఆంధ్ర అనే పదం పై విషం కక్కి సెంటిమెంట్ ను రాజేశారు
- నిజమైన తెలంగాణవాదులు కోరుకున్న విధంగా కాంగ్రెస్ ప్రతి కార్యక్రమం చేపడుతుంది
- కేసీఆర్ ఏ త్యాగం చేయకుండా చేసినట్లు నటిస్తున్నారు
- ఆంధ్ర బిర్యానీ పనికి రాదన్న మీరు రోజా ఇంటికి వెళ్లి తిన్నపుడు తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాలేద
- మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకే చిహ్నం ఉంటుంది
- టీ.పీ.సీ.సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్
కేసీఆర్ కుటుంబసభ్యులు ఆంధ్ర అనే పదంపై విషం కక్కి సెంటిమెంట్ను రాజేస్తున్నారని టీ.పీ.సీ.సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్ లో మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇస్తే ఆ సెంటిమెంట్ ను వాడుకొని మార్చిన ఘనత కల్వకుంట్ల కుటుంబందేనని ఆరోపించారు. నిజమైన తెలంగాణవాదులు కోరుకున్న విధంగా కాంగ్రెస్ గత నాలుగు నెలలుగా ప్రతి కార్యక్రమం చేపడుతుంది అని తెలిపారు. నిజమైన తెలంగాణవాదులు కోరుకున్న దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే కేసీఆర్ కుటుంబం హంగామా చేయాలనీ చూస్తుందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుల అభిప్రాయం మేరకు చిహ్నంలో అమరవీరుల స్థూపాన్ని పెడితే మీకున్న కడుపు నొప్పి ఏంటి , అమరవీరుల వల్లనే తెలంగాణ రాష్ట్ర వచ్చింది, చిహ్నంలో అమరవీరుల స్థూపం పెట్టడం పై ఎందుకు నానా హంగామా చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ త్యాగం చేయకుండా చేసినట్లు నటిస్తున్నారని, అందుకే నానా హంగామా చేస్తునట్టు అనిపిస్తుందని అన్నారు. తెలంగాణ కవులు , కళాకారులు ఎం అనుకుంటున్నారో ఆ విధంగానే ముందుకు వెళ్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది బలిదానాలు చేసుకుంటున్నారానే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు. అందరితో సంప్రదించిన తర్వాతనే ప్రజలు కోరుకున్న విధంగా వారి ఆకాంక్షలకు అనుగుణంగా చిహ్నంను తీసుకోని వస్తామని వెల్లడించారు. 2014 నుండి మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన ఘనతను బయటపెడతామని తెలిపారు. చిన జీయర్ స్వామిని కూర్చోబెట్టినప్పుడు ఏ సెంటిమెంట్ గుర్తురాలేదా అని ప్రశ్నించారు. అందే శ్రీ రాసిన గీతాన్ని తెలంగాణ పాటగా పెట్టకుండా రామకృష్ణ అనే ఆంధ్ర వ్యక్తితో పాట పాడించారని గుర్తుచేశారు. కీరవాణి ఎంపిక, ఆలోచన తమది కాదని అందే శ్రీ ఆలోచన అని స్పష్టం చేశారు. ఆంధ్ర బిర్యానీ అంటే పనికి రాదని అన్న మీరు రోజా ఇంటికి వెళ్లి తిన్నపుడు తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకు రాలేద అని ప్రశ్నించారు. పనికి రాని ప్రాజెక్ట్ కట్టి, ఆంధ్ర సీఎం ను పిలిచినప్పుడు, శారద పీఠం భూములు ఇచ్చినప్పుడు తెలంగాణ సెంటిమెంట్ గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్‌గా మర్చి తెలంగాణ పదం తీసినందుకే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తీసేసారు అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఎవరికీ ఇచ్చారని ప్రశ్నించారు. కవులు, కళాకారులు వివిధ పార్టీల నుండి సమాచారం తీసుకున్న తర్వాతనే మేనిఫెస్టో లో హామీలను పెట్టామని, వాటి ఆధారంగానే ఈ రోజు నడుస్తున్నాం అని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు రేవంత్, భట్టి, ఉత్తమ్ ఆలోచనలు కాదని ప్రజల నుండి వచ్చిన అకాంక్ష అని తెలిపారు. చిహ్నాన్ని కోసం అందరితో చర్చించి మెజారిటీ ప్రజల నిర్ణయం మేరకు మా నిర్ణయం ఉంటుందని వెల్లడించారు.