Thursday, September 19, 2024
spot_img

సింగరేణి కార్మికుల ఓటుకు అధికారం ఎప్పుడు.?

Must Read

బొగ్గు గని కార్మికులు తల్లి గర్భం లాంటి భూగర్బంలో బొగ్గును ఉత్పత్తి చేసి అనేక పరిశ్రమలకు సరఫరా
చేస్తున్నారు.రైతు కూలీలు కష్టపడి లోకానికి అన్నం పెడుతున్నారు. రైల్వే,ఆర్టీసి,విమానయానం,సముద్రయానం ఓడ,లారీ,కంటైనేర్,కార్మికులు, ఉద్యోగులు ప్రజల ప్రయాణానికి,నిత్యావసర,ఆహార ధాన్యాల రవాణాకు శ్రమిస్తున్నారు.విద్యుత్ జనరేషన్,ట్రాన్స్ మిషన్,డిస్కామ్ ఉద్యోగులు విధులు నిర్వయిస్తూ నిరంతరాయంగా కరంటు సరఫరా చేస్తున్నారు.ఫారమెడికల్ ఉద్యోగులు ప్రజా ఆరోగ్యానికి,పారిశుద్ధ్య కార్మికులు అపరిశుభ్ర పరిసరాలను శుభ్రం చేసి కాలుష్య నియంత్రణకు యిలా ఉత్పత్తి, ఉత్పాదకత,ప్రజా సౌకర్యాల,సేవా రంగాలలో కాలంతో పరుగెడుతూ శ్రమిస్తున్నారు.కాని కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ మాత్రం తన విధులను సక్రమంగా నిర్వహించడం లేదు.సెంట్రల్ లేబర్ కమీషనర్(సి.ఎల్.సి)రీజనల్ లేబర్ కమీషనర్, డిప్యూటీ చీఫ్ లేబర్ కమీషనర్, అసిస్టెంట్ లేబర్ కమీషనర్ లు నిర్వహణ విధులను నిర్వహిస్తారు. సాంకేతిక పరిజ్ఞానం,సిబ్బంది,సౌకర్యాలు అందుబాటులో ఉండే ఆఫీస్ లలో పనులు చేస్తారు.దాదాపుగా మానసిక శ్రమతో ఉత్తరప్రత్యుత్తరాల పనులను మాత్రమే చేస్తారు.అయితే కనీసం అట్టి కాగిత పనులను కూడా సమయానుకూలంగా చేయకుండా కార్మికుల కష్టాలకు కారణం అవుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారంగా సింగరేణిలో 2023 డిసెంబర్ 27న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగినవి.కేంద్ర కార్మిక శాఖ,ఆరు జిల్లాల కలెక్టర్ లు, సింగరేణి యాజమాన్యం సమన్వయంగా ఎన్నికలను నిర్వహించారు.గుర్తింపు,ప్రాతినిధ్య హోదాలను పొందడానికి 13 కార్మిక సంఘాలు ఎన్నికల్లో పోటీ చేసినవి.సింగరేణిలో ఓటు హక్కు ఉన్న 39,773 మందికి గాను 37,451 మంది కార్మికులు బ్యాలెట్ ఓటును వేశారు. పెద్దపల్లి, మంచిర్యాల, కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలోని అర్జీ –1 మరియు 2, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి డివిజన్ లలో అలాగే మిగతా 6 డివిజన్ లలో “”సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్/ ఏఐటీయూసీ 16,177 ఓట్లను సాధించి గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచింది.జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి,ఖమ్మం/సత్తుపల్లి జిల్లాలోని భూపాలపల్లి, కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం,మణుగూరు, అర్జీ –3,
ఇల్లందు డివిజన్ లలో మరియు మిగతా డివిజన్ లలో 14,175 ఓట్లు సాధించి “”సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్/ఐఎన్టీయుసి ప్రాతినిధ్య కార్మిక సంఘంగా గెలిచింది. సింగరేణి వ్యాప్తంగా ఎక్కువ ఓట్లు సాధించిన ఏఐటీయూసీకి గుర్తింపు హోదాను ,అలాగే డివిజన్ ల స్థాయిలో ఎక్కువ ఓట్లు సాధించిన ఐఎన్టీయుసికి ప్రాతినిధ్య హోదా పత్రాలను రీజనల్ లేబర్ కమీషనర్ (సెంట్రల్)హైదరాబాద్ కనీసం వారం రోజులలో ఇవ్వాలి.అప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ప్రతి బొగ్గు గని,డిపార్ట్ మెంటుకు చెందిన “”సేఫ్టీ, మైన్స్,పీట్ కమిటీల మరియు ,డివిజన్ కమిటీల,

డిజిఎంఎస్ (డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ)త్రైపార్టీయేట్ సేఫ్టీ కమిటీ, జె.సి.సి(జాయింట్ కన్సల్టెంట్ కమిటీ)కార్పోరేట్ స్ట్రక్చర్ కమిటీ నాయకుల పేర్లను,హోదాలను నమోదు చేసిన పత్రాలను యాజమాన్యంకు ఇస్తుంది.అలాగే ప్రాతినిధ్య కార్మిక సంఘం డివిజన్ స్థాయి కమిటీలు,జె.సి.సి కమిటీ నాయకుల పేర్లను,హోదాలను నమోదు చేసిన లెటర్ లను ఇస్తుంది.దానికి సింగరేణి యాజమాన్యం ప్రతి నెల డివిజన్ స్థాయిలో జనరల్ మేనేజర్ అధ్యతన కార్మిక సమస్యలపై గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి పరిష్కారం చేస్తుంది.కార్పొరేట్ స్థాయిలో ప్రతి రెండు నెలలకు ఒకసారి గుర్తింపు కార్మిక సంఘంతో డైరెక్టర్ పర్సనల్,అడ్మినిస్ట్రేట్ అండ్ వెల్ఫేర్ అధ్యక్షతన ,ప్రతి మూడు నెలలకు ఒకసారి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అధ్యక్షతన స్ట్రక్చర్ కమిటీ మీటింగ్ లలో కార్మిక సమస్యలపై చర్చించి బైపార్టీయేట్ ఒప్పందాలను చేస్తుంది.విధానపరమైన సమస్యల పరిష్కారానికి త్రైపార్టీయేట్ ఒప్పందాలను చేస్తుంది.అలాగే ప్రతి మూడు నెలలకు ఒక సారి గుర్తింపు మరియు ప్రాతినిధ్య కార్మిక సంఘాలతో సి.అండ్ ఎం.డి అధ్యక్షతన జె.సి.సి మీటింగ్ జరిపి కార్మిక సమస్యలను రికార్డ్ చేస్తుంది.అయితే కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల్లో గెలిచిన కార్మిక సంఘాలకు గుర్తింపు, ప్రాతినిధ్య హోదా పత్రాలను ఇవ్వనందున ఒక్క మీటింగ్ జరగలేదు.

పోరాడే వారిదే ఎర్ర జండా!

అన్నట్లుగా సింగరేణిలో సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస),ఎఐఎఫ్ టియు, ఐఎఫ్ టియు లాంటి విప్లవ కార్మిక సంఘాలు, వామపక్ష కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాలు, సాజక్(సింగరేణి అల్ అసోసియేషన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ)దాదాపు 94 కార్మిక సంఘాలు విడిగా,ఐక్యంగా కార్మిక సమస్యల పరిష్కారంకై అనేక పోరాటాలు చేసినవి.అప్పటి ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికుల చైతన్యాన్ని నీరుగార్చి పోరాటాలను నిలువరించడానికి సింగరేణిలో ఎన్నికల ప్రక్రియకు అరంగేట్రం చేసింది.భారతదేశంలోని కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)లో లేని గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను 1998 సెప్టెంబర్ 9 న సింగరేణిలో నిర్వహించారు.అట్లా 2001 ఫిబ్రవరి 19న,2003 మే 14 న,2007 ఆగస్ట్ 9న,2012 జూన్ 28న,2017 అక్టోబర్ 5న,2023 డిసెంబర్ 27 న జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ 16,177 ఓట్లను,ఐఎన్టీయుసి 14,175 ఓట్లను సాధించినట్లుగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరించిన డిప్యూటీ చీఫ్ లేబర్ కమీషనర్ (సెంట్రల్)దృవీకరణ పత్రాలను అదే రోజు ఇచ్చాడు.ఎన్నికల్లో గెలుపొందిన పత్రాలను ఇచ్చి 6 నెలలు కావస్తున్నప్పటికి ఇంకా గుర్తింపు హోదా పత్రాలను ఇవ్వడానికి కేంద్ర కార్మిక శాఖ మొండిగా వ్యవహరిస్తోంది. దానితో సింగరేణి యాజమాన్యం కార్మిక సమస్యలను చర్చించడానికి, పరిష్కరించడానికి సమావేశాలను ఏర్పాటు చేయడం లేదు.పని స్థలాల్లో రక్షణ లోపాల వలన ఇప్పటికే ఇద్దరు కార్మికులు చనిపోయారు.సింగరేణి మరియు కార్పొరేట్ హాస్పటల్స్ లో సరియైన వైద్య చికిత్స లేక ఇబ్బందులు పడుతున్నారు. చట్టబద్దంగా వ్యవహరించవలసిన కేంద్ర ప్రభుత్వ కార్మిక శాఖ కేవలం ఒక కాగితం ఉత్తర్వులు జారీ చేయడానికి ఆరు నెలలు అయిన ఇవ్వకుండా ఏమి చేస్తున్నారని కార్మికులు ప్రశ్నించుచున్నారు.ఇప్పటికైనా కేంద్ర లేబర్ కమీషనర్, ప్రాంతీయ లేబర్ కమీషనర్ లు స్పందించి సింగరేణి ఎన్నికల్లో గెలిచిన కార్మిక సంఘాలకు గుర్తింపు,ప్రాతినిధ్య హోదా పత్రాలను ఇచ్చి పారిశ్రామిక వివాదాల పరిష్కారానికి, పారిశ్రామిక శాంతికి సహకరించాలని కోరుకుంటున్నారు.

మీ భవదీయుడు
మేరుగు రాజయ్య
సెల్ నంబర్ 9441440791.

            
Latest News

బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This