Thursday, March 13, 2025
spot_img

నాగారం నాలా ఎక్కడ.?

Must Read
  • టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారులతో లోపాయికారి ఒప్పందం
  • మేనేజ్ చేసి అడ్డదారిలో అనుమతులు
  • మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు స్థానిక ప్రజల పిర్యాదు
  • రంగంలోకి దిగిన ఇరిగేషన్ శాఖ అధికారులు
  • ఎంక్వైరీ చేసి నగర మున్సిపల్ కమిషనర్ కు రిపోర్ట్
  • అనుమతులు రద్దు చేసి అక్రమ నిర్మాణం తీసెయ్యాలని లేఖ
YouTube player

తెలంగాణలో ఎక్కడ భూమి ఖాళీగా కనపడ్డ దాన్ని కబ్జా చేయడం, అనుమతులు లేకుండా బిల్డింగ్ లు వెలిశాయి. గత ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి చెందిన నేతలు ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములే కాకుండా చెరువులు, కుంటలను కూడా వదల్లేదు. ‘అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు’ అన్నట్టుగా రాజకీయ నాయకులు పదేళ్లల్లో ఎన్నో భూములను కబ్జా పెట్టి, అక్రమ కట్టడాలు చేపట్టారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతుండడంతో అధికారం, అంగ బలంతో పొతం పెట్టారు. టౌన్ ప్లానింగ్, రెవిన్యూ అధికారుల అండతో కొందరూ భూములను కొల్లగొట్టారు. మరికొందరూ అక్రమ భవనాలు నిర్మించారు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ ప్రజా ప్రతినిధి తనకున్న పలుకుబడితో ఏకంగా బఫర్ జోన్ లో భవన నిర్మాణానికి అనుమతులు ఇప్పించారు. ఒక్కటేంటి వెలుగులోకి రానివి ఇంకా చాలానే ఉన్నాయి. కరీంగూడ నుంచి రాంపల్లి మీదుగా మర్రిపల్లిగూడెం ఏదులాబాద్ చెరువు వెళ్లే నాలాను నాగారం మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 110, 112లో బఫర్ జోన్ ఉన్న 9 మీటర్స్ స్థలంలో డూప్లెక్స్ భవన నిర్మాణాలు చేపట్టారు.

భాగ్యనగరం మున్సిపల్ పరిధిలోని రాంపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 110, 112, ప్లాట్ నెంబర్ 37,38,39/లో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్థానిక నేతల ప్రోత్సాహంతో కళ్ళు మూసుకొని ఏకంగా బఫర్ జోన్ లో అనుమతులు ఇచ్చిన నగరం మున్సిపల్ అధికారులు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించే టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు తన ఉనికి మర్చిపోయి చిల్లర పైసలకు కక్కుర్తిపడి నైన్ మీటర్స్ బఫర్ జోన్ పరిధికి అనుమతులు ఇచ్చి నేడు ప్రజా పాలనలో దోషులుగా నిలబడుతున్నారు. కాగా, రాంపల్లి గ్రామంలో కరీంగూడ నుండి మరిపల్లిగూడెం చెరువుకు వెళ్లే నాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో రాంపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో తక్షణమే విచారణ చేసి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ ఇరిగేషన్ శాఖకు జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నాడు అడిగేవారే లేరు అంతా మా రాజ్యమే మా ప్రభుత్వంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా చెల్లవు అంటూ రాంపల్లి గ్రామంలో నాలా పక్కనే బఫర్ జోన్ లో నాలుగు డూప్లెక్స్ హౌస్ నిర్మాణం చేయడంతో అదీ నేడు తెరపైకి వచ్చింది.

మరోవైపు ఇరిగేషన్ శాఖ అధికారిని ఆదాబ్ ప్రతినిధి వివరణ కోరగా.. విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఘటన స్థలానికి వెళ్లి పూర్తిగా పరిశీలించి నైన్ మీటర్స్ బఫర్ జోన్ లో నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించి జిల్లా కలెక్టర్ కు నగరం మున్సిపల్ అధికారికి వివరాలు వెల్లడించారు. తక్షణమే అనుమతులు రద్దు చేసి నిర్మాణాలు తొలగించాలంటూ నగరం మున్సిపల్ కమిషనర్ కు ఇరిగేషన్ అధికారులు ఫైల్ పెట్టిన కూడా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. గత ప్రభుత్వంలో పైరవీలు జరిగినట్టే ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయంటూ రాంపల్లి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం.. గతంలో జరిగిన భూముల కబ్జాలు, అక్రమ నిర్మాణాలు గుర్తించి వాటిని ఆక్యూఫై చేసుకొని అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, వీరికి సహకరించిన టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Latest News

క్షమాపణలు చెప్పాలి

మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతకరం స్పీకర్‌ను అవమాననించారంటూ ఆందోళన సభ మీ సొంతం కాదంటూ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS